షూటింగ్ ను ముగించేసిన చందమామ

Update: 2021-08-08 08:41 GMT
టాలీవుడ్‌ చందమామ కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్ గా పెళ్లి తర్వాత కూడా బిజీ బిజీగా సినిమాలు చేస్తూనే ఉంది. హీరోయిన్ గా ఈమెకు ఇప్పటికి కూడా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. పెళ్లి అయిన తర్వాత పలు సినిమాలకు కమిట్‌ అయిన కాజల్‌ అగర్వాల్‌ కరోనా భయం లేకుండా ఒకదాని తర్వాత ఒకటి ముగించేస్తుంది. ఇటీవలే ఆచార్య సినిమా షూట్‌ లో జాయిన్ అయిన కాజల్‌ అగర్వాల్‌ ఆ షెడ్యూల్‌ ను మగించినట్లుగా తెలుస్తోంది. తాజాగా హిందీలో ఈమె నటిస్తున్న ఉమ అనే సినిమాను ముగించింది. హిందీలో ఉమ సినిమాకు మంచి క్రేజ్ ఉంది. చాలా స్పీడ్‌ గా ఈ సినిమాను పూర్తి చేసినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది.

ఉమ సినిమాతో తథాగతా సింఘా దర్శకుడిగా పరిచయం అవుతుండగా అవికేష్‌ ఘోష్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. భారీ అంచనాలున్న ఈ సినిమా చిత్రీకరణ ముగిసినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. సినిమా షూటింగ్‌ పూర్తి అయిన సందర్బంగా చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ సినిమాలో నటించిన నటీ నటులకు సంబంధించిన వీడియోను షేర్‌ చేయడం జరిగింది. వీడియోలో కాజల్‌ తన పాత్రపై చాలా సంతృప్తిని వ్యక్తం చేసింది. తాను ఈ సినిమాలో కొత్తగా కనిపించబోతున్నట్లుగా వెళ్లడించింది.

తెలుగు లో కాజల్‌ ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా ల్లో అందంతో పాటు నటనతో ఆకట్టుకుంది. ప్రస్తుతం టాలీవుడ్‌ బిగ్‌ హీరోస్ అయిన చిరంజీవి మరియు నాగార్జునలకు జోడీగా ఆచార్య సినిమాలో మరియు ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాల్లో నటిస్తోంది. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా లను అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు. కాజల్‌ కెరీర్ లో దూకుడు చూస్తుంటే చాలా కాలమే సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హిందీలో ఉమ సక్సెస్ అయితే ముందు ముందు మరిన్ని తెలుగు సినిమాలను ఆమె చేస్తుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News