ఫోటో స్టోరి: ఒకే ఆకాశంలో నిండైన‌ రెండు చంద‌మామ‌లు

Update: 2023-04-08 10:04 GMT
ఒకే ఆకాశంలో రెండు చంద‌మామ‌లను ఎప్పుడైనా చూశారా? అయితే అలాంటి అరుదైన దృశ్యం ఇక్క‌డ స‌ర్ ప్రైజ్ చేస్తోంది. ఒక‌టే ఫ్రేమ్.. కానీ రెండు చంద్ర బింబాలు మ‌తులు చెడ‌గొడుతున్నాయి. ఇంత‌కీ ఎక్క‌డి నుంచి పుట్టుకొచ్చారు నిండైన ఆ ఇద్దరు చంద‌మామ‌లు.. అంటే వివ‌రాల్లోకి వెళ్లాలి.

చంద‌మామ అన‌గానే తెలుగు ప్ర‌జ‌లు ఇట్టే గుర్తు ప‌ట్టేస్తారు. ది గ్రేట్ కాజ‌ల్ అగ‌ర్వాల్ అని వెంట‌నే అభిమానులు తడుము కోకుండా చెప్పేస్తారు. ఇక చంద‌మామ కాజ‌ల్ కెరీర్ అత్యుత్త‌మ ద‌శ‌లో ఉన్న క్ర‌మంలోనే త‌న సోద‌రి నిషా అగ‌ర్వాల్ ని కూడా సినీరంగంలోకి తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే.నిషా కొన్ని విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించినా కానీ ఎందుక‌నో కెరీర్ ప‌రంగా కాజ‌ల్ స్థాయిని అందుకోలేక‌పోయింది. కాజ‌ల్ అంత వైబ్రేంట్ కెరీర్ ర‌న్ ని సాగించ‌డంలో త‌డ‌బ‌డింది.

ఇక అవ‌కాశాలు త‌గ్గే క్ర‌మంలోనే పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలైంది. నిషా వార‌సుల‌ను త‌న పెళ్లికి ముందు కాజ‌ల్ ఆట‌లాడిస్తూ.. సోద‌రి బిడ్డ‌ను త‌న బిడ్డ‌గా మురిపెంగా చూసుకునేది. కానీ ఇప్పుడు త‌న‌కు కూడా పెళ్ల‌యి ఒక బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. కాజ‌ల్- గౌత‌మ్ కిచ్లు జంట‌కు ఇటీవ‌ల బేబి బోయ్ జ‌న్మించగా నీల్ అని నామ‌క‌ర‌ణం చేసారు.

ఇక ఇదంతా చంద‌మామ‌ సిస్ట‌ర్స్ గ‌త హిస్ట‌రీ అనుకుంటే.. వ‌ర్త‌మానంలో కాజ‌ల్- నిషా అగ‌ర్వాల్ లేటెస్ట్ ఫోటోషూట్ తో మ‌తులు చెడ‌గొడుతున్నారు. ఒకే ఫ్రేమ్ లో నిండైన రెండు చంద‌మామ‌లు వ‌చ్చి చేరాయా? అన్నంత అందంగా ఈ ఫోటోషూట్ కుదిరింది.

పాపుల‌ర్ ఆజా (aza) ఫ్యాష‌న్ మ్యాగ‌జైన్ కోసం ఫోటోషూట్ ఇది. "సచ్ ఏ ఫ‌న్ షూట్ విత్ మై ఫ్యాబ్యుల‌స్ సిస్ట‌ర్!" అన్న ల‌వ్ లీ క్యాప్ష‌న్ తో కాజ‌ల్ అగ‌ర్వాల్ స్వ‌యంగా ఈ ఫోటోల‌ను ఇన్ స్టాలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారాయి.

ర‌క‌ర‌కాల డిజైన‌ర్ దుస్తుల్లో సిస్ట‌ర్స్ ఫోజులు యువ‌త‌రం వాట్సాపుల్లో సోష‌ల్ మీడియాల్లో జోరుగా షికార్ చేస్తున్నాయి. కాజ‌ల్ ఇటీవ‌ల కంబ్యాక్ విష‌యంలో సీరియ‌స్ గా ఉంది. వ‌రుస‌గా అగ్ర హీరోల సినిమాల‌కు సంత‌కాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ స‌ర‌స‌న తొలిసారి త‌న కెరీర్ లో న‌టిస్తోంది. త‌దుప‌రి టాలీవుడ్ అగ్ర హీరోల సినిమాల్లో న‌టించేందుకు త‌హ‌త‌హ‌లాడుతోంది. అలాగే పెళ్లికి ముందు ప‌లు భారీ క్రేజీ సినిమాల్లో ఆఫ‌ర్లు వ‌చ్చినా కాజ‌ల్ తిర‌స్క‌రించిన సంగ‌తి తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News