శివాజీ కామెంట్స్.. సారీ చెప్పిన మంచు మనోజ్

శివాజీ అలా మాట్లాడటం కరెక్ట్ కాదని హితవు పలుకుతున్నారు. బహిరంగ వేదికపై ఆ విధంగా కామెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు.;

Update: 2025-12-23 12:05 GMT

హీరోయిన్ల డ్రెస్సింగ్ పై టాలీవుడ్ నటుడు శివాజీ చేసిన కామెంట్స్.. వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో అనేక మంది మహిళలు, నటీనటులు శివాజీపై మండిపడుతున్నారు.



 


శివాజీ అలా మాట్లాడటం కరెక్ట్ కాదని హితవు పలుకుతున్నారు. బహిరంగ వేదికపై ఆ విధంగా కామెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఆయన వాడిన భాషతోపాటు పదాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ నెట్టింట రెస్పాండ్ అయ్యారు.

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో స్పెషల్ నోట్ విడుదల చేసి మహిళలకు మనోజ్ సారీ చెప్పారు. అయితే అందులో శివాజీ పేరు ఎత్తకుండా ఆయన తరఫున మహిళా లోకానికి క్షమాపణలు చెబుతున్నట్లు ఆయన తెలిపారు. మహిళలకు ఎల్లప్పుడూ కూడా గౌరవం, హోదా, సమానత్వం ఇవ్వాలని కోరారు.

అలాంటి ప్రకటన చేయడం తనకు తీవ్ర నిరాశకు గురిచేసిందని మనోజ్ తెలిపారు. స్త్రీలు ఆ దుస్తులు మాత్రమే వేసుకోవాలని అనడం కరెక్ట్ కాదని చెప్పారు. నైతికంగా ఒక విధంగా ఉండాలంటూ ఒక చట్రంలో పెట్టడం ఆమోదయోగ్యమైనది కాదని పేర్కొన్నారు. గౌరవం, జవాబుదారీతనం పర్సనల్ బిహేవియర్ ద్వారా మాత్రమే వస్తుందని చెప్పారు. క్లాత్స్ బట్టి ఎవరినీ కూడా ఎగతాళి చేయడం ద్వారా రాదని అన్నారు.

అయితే మహిళల గురించి అలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఉల్లంఘించడమేని మనోజ్ అభిప్రాయపడ్డారు. సమానత్వం, గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో ఎప్పుడూ చర్చలకు ఛాన్స్ లేదని, ఉండదని అన్నారు. ప్రజల అభిప్రాయాల కోసం.. మహిళలు దుస్తులు వేసుకోరని చెప్పారు. అలాంటి అవసరం లేదని పరోక్షంగా చెప్పుకొచ్చారు.

మహిళలను వస్తువుల్లా చూస్తూ, గౌరవాన్ని కించపరిచేలా నటుడు చేసిన వ్యాఖ్యలకు ఆయన తరఫున తాను క్షమాపణ చెబుతున్నానని మనోజ్ తెలిపారు. మిగతా వాళ్ళు కూడా ఆయనలా మాట్లాడతారని అనుకోవద్దని, ఎవరూ కూడా సైలెంట్ గా వ్యాఖ్యలను భరించాల్సిన అవసరం లేదని మనోజ్ తెలిపారు. ఇలాంటి విషయాల్లో జవాబుదారీతనం ఎప్పుడూ అవసరమని చెప్పారు. ప్రస్తుతం మనోజ్ పోస్ట్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

కాగా, హీరోయిన్లు సామాన్లు కనిపించేలా డ్రెస్సులు వేసుకోవద్దని శివాజీ షాకింగ్ కామెంట్స్ చేశారు. గ్లామర్ ఎక్కువ వద్దని అన్నారు. ప్రతి దానికి లిమిట్ ఉండాలని చెప్పారు. ఆ సమయంలో కొన్ని డ్రెస్సులు చూశాక.. లోపల దరిద్ర **, మంచి బట్టలు వేసుకోవచ్చు కదా అని అనిపిస్తుందని అన్నారు. కానీ బయటకు చెబితే స్వాతంత్ర్యం, స్వేచ్ఛ లేదా అని అంటారని తెలిపారు. ఆ వ్యాఖ్యలే తీవ్ర దుమారాన్ని రేపాయి.

Tags:    

Similar News