చిరు వెర్సస్ ఎన్టీఆర్.. కాజల్ ఓటు ఎవరికి?

Update: 2017-01-22 09:07 GMT
స్టార్ హీరోయిన్లు ఐటెం సాంగ్స్ చేసే సంప్రదాయం కొన్నేళ్ల ముందే మొదలైనప్పటికీ కాజల్ అగర్వాల్ మాత్రం చాలా కాలం మడికట్టుకుని కూర్చుంది. ఐటెం అవకాశాల్ని అంగీకరించలేదు. ఐతే గత ఏడాది వరుసగా రెండు డిజాస్టర్లు తినేసరికి ఆమె ఆలోచన మారిందో ఏమో.. కెరీర్లో తొలిసారి ఐటెం సాంగ్ చేసింది. పక్కా లోకల్.. అంటూ ‘జనతా గ్యారేజ్’లో ఆమె చేసిన ఐటెం సాంగ్ ఆ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాటతోనే ‘కాజలిజం’ అనే కొత్త పదం ప్రచారంలోకి వచ్చింది.

తనకు అంతగా పేరు తెచ్చిపెట్టిన ఆ పాటను కాజల్ కూడా చాలా ప్రత్యేకంగానే భావిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో చేసిన ‘అమ్మడు లెట్స్ డు కుమ్ముడు’ పాట కంటే కూడా ఇదే తనకు చాలా స్పెషల్ అని కాజల్ చెప్పడం విశేషం. చిరుతో నటించడం మరపురాని అనుభవం అంటూనే.. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు.. పక్కా లోకల్ పాటల్లో ఏది ఎక్కువ ఇష్టమని అంటే రెండోదానికే ఓటేసింది.

కాజల్ అనే కాదు.. ఆమె ఎందులో ఆకర్షణీయంగా కనిపించిందని సామాన్య జనాల్ని అడిగినా ‘పక్కా లోకల్’ పాటకే ఓటేస్తారనడంలో సందేహం లేదు. అందులో ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోను కూడా కనిపించకుండా చేసేసింది కాజల్. ఆమె అందాలు.. డ్యాన్స్ ఆ పాటకు అంత ఆకర్షణగా నిలిచాయి. ‘అమ్మడు లెట్స్ డు కుమ్ముడు’లో కాజల్ పాత్ర నామమాత్రం. అందులో చిరునే హైలైట్ అయ్యాడు. మధ్యలో రామ్ చరణ్ వచ్చి కొంచెం క్రెడిట్ తీసుకున్నాడు. అందుకేనేమో తాను హైలైట్ అయిన పాటకే ఓటేసింది కాజల్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News