ఎంతవరకు ఈ ప్రేమ అంటున్న కాజల్
రంగం హీరో జీవా.. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ జంటగా నటించిన తమిళ మూవీ కావలై వేండాం.. తెలుగులో 'ఎంతవరకూ ఈ ప్రేమ' అనే టైటిల్ తో వచ్చేస్తోంది. ఇప్పుడీ మూవీ తెలుగు వెర్షన్ కి ఆడియో లాంఛ్ జరింగింది. డైరెక్టర్ డీకే మినహాయిస్తే.. దాదాపు ప్రధాన యూనిట్ అంతా ఈ కార్యక్రమానికి అటెండ్ కావడంతో.. తెలుగు వెర్షన్ పై ఈ యూనిట్ ఎంత నమ్మకంగా ఉందో అర్ధమవుతుంది.
అయితే జీవా మాత్రం నిజంగానే ఫన్నీగా స్పీచ్ ఇచ్చేశాడు. "తెలుగులో'అందరికీ నమస్కారం' మాత్రమే నాకు వచ్చు" అన్న జీవా... "మనవాడు మంచివాడు.. మన ఫేవరేట్ పెసరట్టు" అంటూ తనకొచ్చిన రెండు తెలుగు ముక్కలు చెప్పేశాడు. తెలుగు నేర్పించమంటూ కాజల్ ని అడిగితే.. చందమామ పక్కెనవరినో అడిగి మరీ.. శుభాకాంక్షలు చెప్పడం నేర్పించింది. ఎలాగోలా చివరకు 'అందరికీ దీపావళి శుభాకాంక్షలు' అంటూ.. ఎంతవరకూ ఈ ప్రేమ సినిమా సంగతులు చెప్పాడు జీవా.
అంతకు ముందు కాజల్ కూడా ఒకటి రెండు తెలుగు ముక్కలతో సరిపెట్టి.. ఆ తర్వాత 'ఈ మూవీలో యాక్ట్ చేయడం నా అదృష్టం. నేను వర్క్ చేసిన డైరెక్టర్లలో యంగెస్ట్.. కూలెస్ట్ డైరెక్టర్ డీకే. రషెస్ ను ఫైనల్ చేసేందుకు హడావిడిగా చెన్నై వెళ్లాల్సి వచ్చింది. మ్యాన్ ఆఫ్ ద డే మ్యూజిక్ డైరెక్టర్ లియాన్ జేమ్స్ అద్భుతమైన సంగీతం ఇచ్చాడు. సునయన చాలా మంచి పెర్ఫామర్. ఇక హీరో జీవా గురించి చెప్పాలంటే.. రియల్లీ ఫన్నీ కోస్టార్. ఈ సినిమా కారణంగా ఇండస్ట్రీలో నాకు లభించిన బెస్ట్ ఫ్రెండ్' అని చెప్పింది కాజల్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/