• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'ఇండియన్ 2' పై క్రేజీ...

'ఇండియన్ 2' పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన కాజల్..!

By - Tupaki Desk
Update: 2022-08-05 03:54 GMT
విశ్వనటుడు కమల్ హాసన్ మరోయి5షోమ్యాన్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన 'భారతీయుడు' సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. పాతికేళ్ల తర్వాత వీరిద్దరి కలయికలో దీనికి సీక్వెల్ గా ''ఇండియన్ 2'' చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో స్టార్ క్యాస్టింగ్ - టాప్ టెక్నిషియన్స్ తో భారీ స్థాయిలో ఈ సినిమాని రూపొందించేందుకు ప్లాన్ చేసారు.

'భారతీయుడు' సినిమాలో కమల్ హాసన్ తోపాటుగా కాజల్‌ అగర్వాల్‌ - రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ - బొమ్మరిల్లు సిద్ధార్థ్ - బాబీ సింహా - సముద్రఖని తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ నిర్వహించారు.

కానీ 65 శాతం చిత్రీకరణ జరిగిన అనంతరం అనుకోని పరిస్థితుల వల్ల 'ఇండియన్ 2' సినిమా ఆగిపోయింది. దీంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను పూర్తిగా పక్కన పెట్టేసారా.. మళ్లీ ఎప్పుడు పట్టాలెక్కిస్తారు అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కమల్ - శంకర్ చిత్రాన్ని తిరిగి సెట్స్ మీదకు తీసుకురాడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం అందుతోంది.

రీసెంట్ గా హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇన్స్టా లైవ్ లో మాట్లాడుతూ.. 'ఇండియన్ 2' సినిమా షూటింగ్ కు సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చింది. సెప్టెంబర్ 13 నుండి ఈ మూవీ చిత్రీకరణ తిరిగి ప్రారంభంకానుందని కాజల్ తెలిపింది. వీలైనంత వేగంగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

నిజానికి 'భారతీయుడు 2' సెట్స్ లో ప్రమాదం జరగడం.. అప్పుడే కరోనా లాక్‌ డౌన్‌ పెట్టడంతో సినిమా షూటింగ్‌ మధ్యలోనే ఆగిపోయింది. వివిధ కారణాల రీత్యా ఈ ప్రాజెక్టు లేట్ అవుతూ ఉండటం.. బడ్జెట్ కూడా పెరిగిపోతుండటంతో దర్శకనిర్మాతల మధ్య విబేధాలు వచ్చి షూటింగ్ నిలిపేశారు. దీంతో శంకర్‌ మరో రెండు ఇతర ప్రాజెక్టులకు కమిట్ అయ్యారు.

తెలుగులో రామ్‌ చరణ్‌ తో.. బాలీవుడ్‌ లో రణవీర్‌ సింగ్‌ తో సినిమాలు చేయనున్నట్లు ప్రకటించారు శంకర్. దీనిపై లైకా సంస్థ మద్రాస్‌ కోర్టుకు వెళ్ళింది. ‘ఇండియన్‌ 2’ సినిమా పూర్తి కాకుండా వేరే ప్రాజెక్ట్ చేయకుండా అడ్డుకోవాలని శంకర్‌ పై కేసు వేసింది. ఈ వ్యవహారం జరుగుతుండగా.. కమల్ హాసన్ మధ్యవర్తిత్వం చేసి రాజీ కుదర్చడంతో ఈ సినిమాని పునఃప్రారంభించడానికి రెడీ అయ్యారని అంటున్నారు.

అయితే దీని ప్రభావం వల్ల RC15 లేట్ అవుతుందేమో అనే కొత్త చర్చ తెర మీదకు వచ్చింది. దిల్ రాజు బ్యానర్ లో శంకర్ తెరకెక్కించే ఈ చిత్రాన్ని వచ్చే సమ్మర్ నాటికి రెడీ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. మరి ఇప్పుడు 'ఇండియన్ 2' చిత్రాన్ని సెప్టెంబర్ లో సెట్స్ మీదకు తీసుకొస్తే..రామ్ చరణ్ సినిమా పరిస్థితి ఏంటని మెగా అభిమానులు కలవరపడుతున్నారు.
Tags:    
  • Kajal Agarwal 
  • Indian 2 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS