• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్రైలర్ టాక్: సూర్య.....

ట్రైలర్ టాక్: సూర్య.. ఖైమా కొట్టాడుగా!

By - Tupaki Desk
Update: 2019-09-05 05:04 GMT
'వీడొక్కడే'.. 'బ్రదర్స్' తర్వాత కేవీ ఆనంద్ -సూర్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'కాప్పాన్'(తెలుగులో 'బందోబస్త్'). మోహన్ లాల్.. ఆర్య.. సాయేషా సెహగల్ ఇందులో ఇతర కీలక పాత్రల్లో నటించారు. త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమాకు గతంలోనే ట్రైలర్ రిలీజ్ అయింది కానీ విడుదలకు ముందుగా మరో థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.  ఈ ట్రైలర్ నిడివి 1.35 నిముషాలే ఉంది కానీ ఇందులో కథ తప్ప సినిమాలో ఉండేదంతా శాంపిల్ గా చూపించారు.

యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా 'ట్రైలర్' ఆద్యంతం ఒక మసాలా సినిమా ఫార్మాట్ తరహాలో సాగింది.  ట్రైలర్ ఓపెన్ చేయగానే సూర్య మూడు గెటప్పుల కట్ షాట్స్.. వెంటనే ఒక బ్లాస్టు.. కట్ చేస్తే ఒక పాట.  ఒకవైపు 'కుయిలే కుయిలే' పాట విజువల్స్ చూపిస్తూ నేపథ్యంలో ప్లే చేస్తుంటారు. అదే పాట నేపథ్యంలో యాక్షన్ సీన్స్ చూపించారు.  అంతలో మోహన్ లాల్ ఓ చేంతాడంత  తమిళ డైలాగ్ చెప్తాడు.  అది అయిపోగానే మళ్ళీ ఒక ట్రైన్ బ్లాస్టు.  వెంటనే మరో పాట.. బ్యూటిఫుల్ విజువల్స్ ఉంటాయి.  ఆ పాటనేపథ్యంలో ప్లే అవుతూనే ఉంటుంది.. ఇంకొన్ని యాక్షన్ సీన్స్ చూపించారు.  అంతలో ఒక హీరోయిన్ తో సరదా సీన్.. మళ్ళీ ఒక యాక్షన్ సీన్.  అంతలో ఇంకో పాట.  ఇంకో యాక్షన్ సీన్. ఇంకో పాట.

చదవడానికే ఇబ్బందిగా ఉంది కదా?  కరెక్ట్.  కంటెంట్ ని బట్టే రివ్యూ ఉంటుంది.  సినిమాలో కంటెంట్ నిజంగా బాగున్నట్టే ఉంది కానీ ఈ ట్రైలర్ కట్ చేసిన మనిషికి శతకోటి పొర్లు దండాలు.  సూర్య.. గుడ్ సాంగ్స్.. థ్రిల్లింగ్ యాక్షన్ సీన్స్ ఉన్న కంటెంట్ ను ఖైమా కొడుతూ ట్రైలర్ ని ఎలా కట్ చేయాలి అనేది ఈ ట్రైలర్ ను చూసే నేర్చుకోవాలి.  ఆడియన్స్ ను బెదరగొట్టడం ఎలా? అనేది కూడా ఈ ట్రైలర్ ద్వారా చూపించారు.  మీరు ఒక లుక్కేయండి.   అన్నట్టు ఈ సినిమా సెప్టెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Full View

Tags:    
  • Suriya 
  • Mohan Lal 
  • Arya 
  • Kaappaan Movie 
  • Kaappaan Trailer 
  • Telugu News 

Similar News

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

Copyright @2026

Powered by Blink CMS