ప్రభాస్‌ ఫ్యాన్‌.. మెడ క్రింద టాటూ..

Update: 2016-05-03 13:30 GMT
అప్పట్లో హీరో ప్రభాస్‌ కు నేను వీరాభిమానిని అంటూ.. హీరో నితిన్‌ తో ఒక పాటలో ఆడిపాడింది షటిల్‌ ప్లేయర్‌ జ్వాలా గుత్తా. ఈ సుందరాంగి ఆ తరువాత తనను తాను వెండితెరమీద చూసుకొని ఏమనుకుందో తెలియదు కాని.. ఇక మరోసారి సినిమాల్లోకి రాను అని చెప్పేసింది. కాకపోతే తన కైపెక్కించే లుక్కుతో ఎప్పటికప్పుడు సోషల్‌ నెట్ వర్క్‌ లో ఊరిస్తూనే ఉంటుంది.

ఈరోజు అమ్మడు తన మెడ మీద.. 2012 ఒలింపిక్స్‌ లోగో ఒకటి పచ్చబొట్టులో పొడిపించుకుంది. ఆ ఒలింపిక్స్‌ ఈమె ఎటువంటి మెడల్‌ గెలవలేదు కదా.. మరి ఈ పచ్చబొట్టు ఏంటమ్మా బేబీ? నిజానికి 2012 ఒలింపిక్స్‌ లో జ్వాలా గుత్తా పేరుతో ఒక రికార్డు నమోదైంది. ఇప్పటివరకు ఒలింపిక్స్‌ మొదలయ్యాక.. బ్యాడ్మింటన్‌ కేటగిరీలో.. మిక్సడ్‌ డబుల్స్‌ అండ్‌ ఉమెన్స్‌ డబుల్స్‌ క్యాటగిరీల్లో ఇండియా తరుపున ఒకేసారి ఆడిన ఏకైక ప్లేయర్‌ జ్వాల. ఇప్పుడు 2016లో రియో లో జరిగే ఒలింపిక్స్ కు కూడా అమ్మడు అర్హత సాధించింది. అందుకే ఈ మెడ మీద క్రింద టాటూ హడావుడి.

టాటూ వేయించుకుందిలే ఓకె.. కాని మరీ ఇలా సెక్సీగా చూపిస్తూ పిక్స్‌ పోస్టు చేయాలా అని అడగాలని అనుకుంటున్నారా? ఎవరి టాటూ వారిష్టం.
Tags:    

Similar News