ముద్దు సీన్లు చేయాలని బలవంతం చేసారు.. ఆరోపించిన టాప్-5 హీరోయిన్‌లు!
తాజాగా లస్ట్ స్టోరీస్ 3 బ్యూటీ రాధిక ఆప్టే ఆరోపణల నేపథ్యంలో ఓసారి గత చరిత్రను పరిశీలిస్తే.. ఈ తరహా వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన నటీమణులలో సన్నీ లియోన్ ఒకరు.
సినిమా పరిశ్రమలో గ్లామర్ పాత్రలు, రొమాంటిక్ సీన్లు సర్వసాధారణం అయినా కొందరు ప్రముఖ నాయికలు మాత్రం కొన్ని సందర్భాల్లో దర్శకులు లేదా నిర్మాతల నుండి తమకు ఇష్టం లేకపోయినా రొమాంటిక్ లేదా ముద్దు సీన్లు చేయాలంటూ ఒత్తిడి ఎదురైందని బహిరంగంగానే ఆరోపించారు. స్క్రిప్ట్ డిమాండ్ పేరుతో తెచ్చే ఈ ఒత్తిళ్లపై పలువురు స్టార్ హీరోయిన్లు గతంలో తమ ఆవేదనను వెలిబుచ్చారు. ముఖ్యంగా నటీమణుల వ్యక్తిగత హద్దులను గౌరవించాల్సిన అవసరం గురించి ఇండస్ట్రీలో ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ కోవలోనే కొందరు ప్రముఖ నాయికలు తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను బయటపెట్టారు.
తాజాగా లస్ట్ స్టోరీస్ 3 బ్యూటీ రాధిక ఆప్టే ఆరోపణల నేపథ్యంలో ఓసారి గత చరిత్రను పరిశీలిస్తే.. ఈ తరహా వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన నటీమణులలో సన్నీ లియోన్ ఒకరు. బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ కెరీర్ ప్రారంభంలో .. కొన్ని చిత్రాల షూటింగ్ సమయంలో దర్శకనిర్మాతల నుంచి అనూహ్యమైన డిమాండ్లు, రొమాంటిక్ సీన్ల విషయంలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు పలు సందర్భాల్లో తెలిపారు. అలాగే బోల్డ్ అండ్ టాలెంటెడ్ నటిగా పేరు తెచ్చుకున్న రాధిక ఆప్టే కూడా ఇండస్ట్రీలోని కొన్ని వాస్తవాలను బయటపెట్టారు. సౌత్ - నార్త్ చిత్రాల్లో పనిచేస్తున్నప్పుడు కథతో సంబంధం లేకపోయినా కేవలం గ్లామర్ కోసమే లేదా రొమాంటిక్ సీన్లు చేయాలని కొందరు ఒత్తిడి తెచ్చారని.. వాటిని తాను స్పష్టంగా తిరస్కరించానని తెలిపారు.
తాజాగా రాధిక ఆప్టే తన కెరీర్ ప్రారంభ రోజుల గురించి.. ఇంటిమేట్ సీన్ల విషయంలో ప్రజలు- దర్శకనిర్మాతల అపోహల గురించి మరింత స్పష్టంగా మాట్లాడారు. కెరీర్ తొలినాళ్లలో తాను కొన్ని చిత్రాలలో పూర్తిగా నగ్నంగా నటించాల్సి రావడంతో అందరూ తను ఎలాంటి సీన్లకైనా సులభంగా ఒప్పుకుంటుందని ఒక తప్పుడు అంచనాకు వచ్చారని పేర్కొన్నారు. గతంలో అలాంటి సీన్లలో నటించానంత మాత్రాన అడిగిన ప్రతిసారీ ఇంటిమేట్ సీన్లకు ఒప్పుకోనని కొందరితో నేను చేయలేనని స్పష్టంగా చెప్పాల్సి వచ్చిందని వెల్లడించారు. ఈ అనుభవాలే తనకు స్వీయ హద్దులను గుర్తించడంలో.. వాటిని స్పష్టంగా తెలియజేయడంలో సహాయపడ్డాయని రాధిక ఆప్టే వివరించారు.
ఇక ఇదే కోవలో తన బోల్డ్ మాటలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే కంగనా రనౌత్ కూడా బాలీవుడ్‌లో ఇన్‌సైడర్స్ ఆధిపత్యంతో పాటు.. కొన్ని చిత్రాల్లో హీరోయిన్లను కేవలం గ్లామర్ డాల్స్‌గా వాడుకోవాలని చూడటంపై తీవ్రంగా మండిపడ్డారు. ఇష్టం లేని ముద్దు సీన్లు లేదా రొమాంటిక్ సన్నివేశాల కోసం దర్శకనిర్మాతలు బలవంతం చేసే సంస్కృతిని కంగన తప్పుపట్టారు. అలాగే వైవిధ్యమైన పాత్రలతో నటిగా నిరూపించుకున్న తాప్సీ పన్ను కూడా తన కెరీర్ ప్రారంభ దశలో వాణిజ్య చిత్రాల్లో నటిస్తున్నప్పుడు కొన్ని అనవసరమైన రొమాంటిక్ పాటలు- సీన్ల కోసం ఇబ్బందికరమైన డిమాండ్లు ఎదుర్కొన్నానని తెలిపారు. ఆ తర్వాత తనకంటూ ఒక బలమైన ఇమేజ్‌ను ఏర్పరచుకుని కేవలం కంటెంట్ ఉన్న పాత్రలనే ఎంచుకోవడం ప్రారంభించారు.
చిత్ర పరిశ్రమలో మారుతున్న కాలంతో పాటు దర్శకులు నటీమణుల సౌకర్యాలకు (కంఫర్ట్ జోన్) ప్రాధాన్యత ఇస్తున్నా కానీ.. గతంలో కొందరు ప్రముఖ హీరోయిన్లు ఈ రకమైన ఒత్తిడిని ఎదుర్కొన్నామని బహిరంగంగా మాట్లాడటం చర్చనీయాంశమైంది. రాధిక ఆప్టే వంటి నటీమణుల తాజా కామెంట్లు చిత్రసీమలో సమ్మతి- వ్యక్తిగత హద్దులు- నటీమణుల గతం ఆధారంగా వారి విషయంలో అంచనాలపై మళ్లీ పెద్ద చర్చకు దారితీశాయి. కెరీర్‌లో గతంలో చేసిన పాత్రలను బట్టి నటీమణులపై ఎలాంటి ముద్ర వేయకూడదని... వారి వ్యక్తిగత నిర్ణయాలను గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ఉదంతాలు గుర్తుచేస్తున్నాయి.