• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ‘జై లవకుశ’లో ఎన్టీఆర్...

‘జై లవకుశ’లో ఎన్టీఆర్ స్పెషల్ ట్రీట్

By - Tupaki Desk
Update: 2017-05-15 07:18 GMT
ప్రస్తుతం టాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్లలో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. అతడికి అన్ని రకాల డ్యాన్సులూ వచ్చు. చిన్నతనంలోనే శాస్త్రీయ నృత్యంలో ప్రావీణ్యం సంపాదించాడు తారక్. తన సినిమాల్లో అప్పుడప్పుడూ ఈ ప్రావీణ్యం ప్రదర్శించాడు. ‘కంత్రి’ సినిమాలోని ఓ పాటలో క్లాసికల్.. మోడర్న్.. కలిపి చేసిన డ్యాన్స్ అభిమానుల్ని అలరించింది.
ఐతే ఇప్పుడు ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో తన శాస్త్రీయ నృత్య ప్రతిభను చూపించబోతున్నాడట. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన కొత్త సినిమా ‘జై లవకుశ’లో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఓ పాత్ర క్లాసికల్ డ్యాన్సరట. ఓ ఎపిసోడ్లో ఆ పాత్ర తన నృత్య ప్రతిభను చూపిస్తుందట. ఎన్టీఆర్ ఈ ఎపిసోడ్లో అదరగొట్టేశాడని.. ఇది అభిమానులకు స్పెషల్ ట్రీటే అని అంటున్నాయి చిత్ర వర్గాలు.

మార్చిలో సెట్స్ మీదికి వెళ్లిన ‘జై లవకుశ’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే 50 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. గత ఏడాది ‘జనతా గ్యారేజ్’ రిలీజైన సెప్టెంబరు 1నే ‘జై లవకుశ’ను రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టైటిల్ లోగో లాంచ్ చేసిన చిత్ర బృందం ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేయనుంది. ఎన్టీఆర్ అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నందిస్తున్నాడు. ఎన్టీఆర్ సరసన రాశి ఖన్నా.. నివేదా థామస్ నటిస్తున్నారు.
Tags:    
  • Jr NTR 
  • Classical Dance 
  • Jai Lava Kusa Movie 
  • Telugu News 
  • Telugu Cinema News 

Similar News

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

2028 లో రెండు సినిమాల‌తో డార్లింగ్!

2026-11-02 15:30 GMT

ఫ్రెండు బర్త్‌డే పార్టీలో క‌పూర్ గాళ్ ర‌చ్చ రచ్చ

2026-11-02 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS