త్రివిక్రమ్ పాన్ ఇండియా హీరోని అదే రేంజిలో చూపిస్తాడా..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో 'అరవింద సమేత వీర రాఘవ' వంటి సూపర్ హిట్ తర్వాత తాజాగా రెండో సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని బ్యానర్‌తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతోన్న ఈ సినిమా జూన్ లేదా జూలైలో ప్రారంభం కానుందట. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తైయిన తర్వాత గ్యాప్ లేకుండా త్రివిక్రమ్ సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాకు 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ప్రస్తుతం ప్రకటించారు. రాజకీయ నేపథ్యంలో ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న పరిస్థితుల పై త్రివిక్రమ్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. పర్ఫెక్ట్ ఫ్యామిలీ పొలిటికల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రానుందని టాక్.
సమ్మర్ 2021లో ఈ సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే మల్టీస్టారర్ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ సినిమా కాబట్టి వేరే ఇండస్ట్రీలలో ఈ స్టార్ హీరోకు మార్కెట్ వస్తుంది. అయితే ఈ సినిమాను ఎన్టీఆర్ 30వ సినిమా రూపొందించనున్నాడు కాబట్టి మరి ఆ ఎన్టీఆర్ హీరోయిజంలో ఆ రేంజ్ అంచనాలు అభిమానులలో నెలకొంటాయి. ఇటీవలే బన్నీతో సుకుమార్ రూపొందించే సినిమా పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా.. తెలుగులోనే రిలీజ్ అవుతుందా.. లేక పాన్ ఇండియా స్టార్ అవుతాడు గనక పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుందా.. తెలియాల్సి ఉంది. ఇక మరి త్రివిక్రమ్ ఎన్టీఆర్ హీరోయిజం ఎలా చూపిస్తాడో చూడాలి!