• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గోండ్రు బెబ్బులి 'కొమురం...

గోండ్రు బెబ్బులి 'కొమురం భీమ్' గా ఎన్టీఆర్ గర్జన..!

By - Tupaki Desk
Update: 2021-05-20 05:06 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''ఆర్.ఆర్.ఆర్". దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు తారక్. అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటిస్తుండగా.. కొమురం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన హీరోహీరోయిన్ల ఫస్ట్ లుక్ - టీజర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో నేడు (మే 20) తారక్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు 'ఆర్.ఆర్.ఆర్' చిత్ర బృందం సర్ప్రైజింగ్ గిఫ్ట్ అందించింది.

RRR టీమ్ ముందుగా ప్రకటించినట్లే ఈ చిత్రం నుంచి 'కొమురం భీమ్'గా జూనియర్ ఎన్టీఆర్ లుక్ ను విడుదల చేసింది. ''భీమ్ మనసు బంగారం. తిరుగుబాటు చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం అతను బలంగా ధైర్యంగా నిలుస్తాడు!'' అని ట్రిపుల్ ఆర్ టీమ్ పేర్కొంది.. భీమ్ గెటప్ లో ఉన్న తారక్ ఆకాశంలోకి ఈటె ఎక్కుపెట్టి గంభీరంగా కనిపిస్తున్నాడు. అతని పాత్ర స్వభావాన్ని తెలియజేసేలా 'నీరు' థీమ్ తో ఈ పోస్టర్ ను డిజైన్ చేశారు. గోండ్రు బెబ్బులి గర్జన థియేటర్లలో ఎలా ఉండబోతుందో చెప్పాడానికి ఇదొక శాంపిల్ అని చెప్పవచ్చు. ఎలాంటి పాత్ర అయినా అవలీలగా పోషించే ఎన్టీఆర్.. మరోసారి పాత్రలో ఒదిగిపోయినట్లు అర్థం అవుతోంది. తారక్ బర్త్ డే కానుకగా వచ్చిన ఈ సర్ప్రైజింగ్ పోస్టర్ అన్ని వర్గాల వారిని విశేషంగా ఆకట్టుకుంటోంది.

'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అలీయా భట్ - హాలీవుడ్ ముద్దుగుమ్మ ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రియా - సముద్రఖని - అలిసన్ డూడీ - రే స్టీవెన్‌ సన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎమ్.ఎమ్ కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డి.పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కాగా, కరోనా విపత్కర పరిస్థితుల్లో తన బర్త్ డే వేడుకలు నిర్వహించవద్దని, దయచేసి అందరూ ఇళ్లలోనే ఉండాలని ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ప్రతి ఒక్కరూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే గత కొన్ని రోజుల క్రితం తారక్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హోమ్ క్యారంటైన్ ‏లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు ఇటీవలే ప్రకటించారు.
Tags:    
  • Rrr Movie 
  • Hbd Jr Ntr 
  • Alia Bhatt 
  • Rajamaouli 
  • Jr Ntr 
  • Komaram Bheem 
  • Telugu News 

Similar News

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

Copyright @2026

Powered by Blink CMS