సర్ ప్రైజింగ్.. డిఫెన్స్ మినిస్టర్ తో JNM టీమ్
విజయ్ దేవరకొండ హీరోగా ప్రస్తుతం కిక్ బాక్సింగ్ నేపథ్యంలో `లైగర్` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు పూరి జగన్నాథ్. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ బాలీవుడ్ కు పరిచయం కానున్న విషయం తెలిసిందే. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని చార్మి, పూరి జగన్నాథ్ తో కలిసి బాలీవుడ్ మేకర్స్ కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మిసత్ఉన్నారు.
హాలీవుడ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ కీలక అతిథి పాత్రలో నటిస్తున్న ఈ మూవీ ని ఆగస్టులో రిలీజ్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. ఇదిలా వుంటే ఈ మూవీ రిలీజ్‌కి ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో విజయ్ దేవరకొండ తో పూరి జగన్నాథ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ `జన గణ మన`ని ప్రారంభించేశాడు. ముంబైలో ఈ మూవీని లాంఛనంగా చిత్ర బృందం ఇటీవల ప్రారంభించింది.
ఇందులో హీరో విజయ్ దేవరకొండ మిలటరీ అధికారిగా దేశం కోసం ఎందాకైనా వెళ్లడానికి సిద్ధపడే పవర్ ఫుల్ అధికారిగా కనిపించబోతున్నారు. ఏప్రిల్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. వరల్డ్ వైడ్ గా వున్న వివిధ దేశాల్లో ఈ చిత్ర కీలక ఘట్టాలని చిత్రీకరించాలని దర్శకుడు పూరి జగన్నాథ్ ప్లాన్ చేశారు. ఇందు కోసం అనుమతులు చాలా అవసరం. ఈ నేపథ్యంలో గురువారం చిత్ర బృందం డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ ని ఢిల్లీలో ప్రత్యేకంగా కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తెలంగాణకు చెందిన మైహోమ్ అధినేత జూపల్లి రామేశ్వరరావు తనయుడు జూపల్లి రామారావు నేతృత్వంలో `జన గణ మన` టీమ్ రాజ్ నాథ్ సింగ్ ని కలవడం చర్చనీయాంశంగా మారింది. దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో విజయ్ దేవరకొండ, చార్మి డిల్లీలో రాజ్ నాథ్ సింగ్ ని కలిశారు. భారీ స్థాయిలో నిర్మాణం జరుపుకోనున్న ఈ మూవీని వచ్చే ఏడాది ఆగస్టు 3న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.