వర్మ తీరు వేరు .. నా దారి వేరు: జేడీ చక్రవర్తి
జేడీ చక్రవర్తి .. 'శివ' సినిమాతో తెలుగు తెరకి పరిచయమయ్యాడు. ఆ సినిమాలో ఆయన పోషించిన 'జేడీ' పాత్ర పేరు ఆయన అసలుపేరుగా మారిపోయింది. అంతగా ఆయన ఆ పాత్ర ద్వారా ప్రేక్షకులను ప్రభావితం చేశాడు. 'శివ' సినిమా చూసిన ఎవరైనా జేడీ చక్రవర్తి విలన్ గా మంచి పేరు తెచ్చుకుంటాడని అనుకుంటారు. కానీ ఆయన హీరోగా అంచెలంచెలుగా ఎదుగుతూ వెళ్లాడు. ఎన్నో విజయాలను తన ఖాతాలో జమ చేసుకున్నాడు. అయితే ఎప్పుడూ కూడా ఆయన తనకి ఇంతటి గుర్తింపు రావడానికి కారణమైన రామ్ గోపాల్ వర్మను మాత్రం మరిచిపోలేదు.
ఎందుకంటే జేడీ చక్రవర్తిని హీరోగా నిలబెట్టిన సినిమాల్లో వర్మ సినిమాలు చూపిన బలం ఎక్కువ. అవి ఆయన కెరియర్లో చెప్పుకోదగిన స్థానంలో నిలిచాయి. ఒక వైపున హీరోగా చేస్తూనే జేడీ దర్శకుడిగా కూడా సత్తా చూపడానికి ప్రయత్నించాడు. అయితే దర్శకత్వం విషయంలో ఆయనకి దక్కింది యావరేజ్ మార్కులే. త్వరలో మరోసారి మెగాఫోన్ పట్టుకోవడానికి జేడీ రెడీ అవుతున్నాడు. రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా వ్యవహరించనున్న ఆ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లే పనుల్లో ఆయన బిజీగా ఉన్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని గురించి ప్రస్తావించాడు.
వర్మ అంగీకరించినా .. లేకపోయినా ఆయనే నా గురువు. వర్మ స్కూల్ నుంచి వచ్చాను గనుక, అంతా నన్ను ఆయనతో పోల్చి మాట్లాడుతుంటారు. కానీ నిజానికి ఆయన తీరు వేరు .. నా దారి వేరు. కుటుంబ బంధాలకు వర్మ చాలా దూరం .. కానీ నేను చాలా ఎమోషనల్. రాత్రి 7 దాటితే ఆయన పార్టీలతో బిజీగా ఉంటారు. కానీ ఆ సమయంలో నేను ఎవరినీ కలుసుకోవడానికి ఇష్టపడను. మా ఆలోచన విధానం డిఫరెంట్ గానే ఉంటుంది. మేము గురుశిష్యులమే అయినా, మా మార్గాలు వేరు. కలిసి కనిపిస్తుంటాంగానీ, మా ప్రయాణాలు వేరు" అని చెప్పుకొచ్చాడు.