జయలలిత వాళ్లిద్దరూ అంటే పడిచచ్చేదట..
జయలలిత జీవితంలో ప్రేమాయణాల గురించి అందరికీ తెలుసు. శోభన్ బాబును అమితంగా ఇష్టపడిన జయ.. ఆయనతో కలిసి ఓ బిడ్డకు జన్మనిచ్చిందన్న వదంతులున్నాయి. మరోవైపు ఎంజీఆర్ తోనూ ఆమె సన్నిహితంగా ఉన్నారు. ఐతే ఇవన్నీ జయకు ఫేమ్ వచ్చాక జరిగినవి. ఐతే ఆమె టీనేజీలో ఉండగా.. ఆమె ఇద్దరు సెలబ్రెటీలంటే పడి చచ్చేదట. వారిలో ఒకరు బాలీవుడ్ నటుడు షర్మి కపూర్ కాగా.. ఇంకొకరు ఇండియన్ క్రికెటర్ నారీ కాంట్రాక్టర్. 2012లో జరిగిన ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వీళ్లిద్దరిపై తనకున్న అభిమానం గురించి వెల్లడించింది జయ.
నారీ కాంట్రాక్టర్ భారత తొలి తరం స్టార్ క్రికెటర్లలో ఒకడు. ఇండియన్ క్రికెట్ గ్లామర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న నారీ కాంట్రాక్టర్ 1955లో ఇండియన్ టీంకు తొలిసారి ప్రాతినిధ్యం వహించాడు. ఏడేళ్ల పాటు భారత జట్టుకు ఆడాడు. ఓ మ్యాచ్ లో తలకు బలమైన గాయం కావడంతో అతడి కెరీర్ అర్ధంతంరంగా ఆగిపోయింది. కేవలం నారీ కాంట్రాక్టర్ ను చూడటం కోసమే తాను ఇండియా ఆడే టెస్టు మ్యాచ్ లు చూసేదాన్నని ఇంటర్వ్యూలో జయ చెప్పడం విశేషం.
మరోవైపు రాజ్ కపూర్ తమ్ముడైన షర్మి కపూర్ అన్నా జయకు అంతే ఇష్టమట. అందగాడైన షర్మి కపూర్ అంటే అమ్మాయిలు అప్పట్లో పడి చచ్చేవాళ్లు. షర్మి కపూర్ నటించిన ‘జంగిల్’ తన ఫేవరెట్ ఫిల్మ్ అని చెబుతూ.. ఆ సినిమాలో మహ్మద్ రఫి పాడిన పాటను కూడా ఆ ఇంటర్వ్యూలో జయ ఆలపించారు. ఆ పాట కూడా తనకెంతో ఇష్టమన్నారు. ప్రస్తుతం జయ ఆ పాట పాడుతున్న వీడియో వైరల్ అవుతోంది. ఐతే జయ తాను ఇష్టపడ్డ ఇద్దరినీ జీవితంలో ఒక్కసారి కూడా కలవకపోవడం విచిత్రమే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/