అఖండ 2 ప్రీమియర్స్ లెక్క.. బాలయ్య మాస్ మ్యాజిక్ అంటే ఇదేనేమో!

నందమూరి బాలకృష్ణ సినిమా అంటే లాజిక్కులు, మ్యాజిక్కులు వెతకకూడదు.. కేవలం థియేటర్లో ఆ మాస్ వైబ్ ను ఎంజాయ్ చేయాలంతే.;

Update: 2025-12-12 10:55 GMT

నందమూరి బాలకృష్ణ సినిమా అంటే లాజిక్కులు, మ్యాజిక్కులు వెతకకూడదు.. కేవలం థియేటర్లో ఆ మాస్ వైబ్ ను ఎంజాయ్ చేయాలంతే. అఖండ 2 విషయంలో ఫ్యాన్స్ ఇప్పుడు సరిగ్గా ఇదే సౌండ్ చేస్తున్నారు. కోర్టు కేసులు, వాయిదాల గొడవలు, చివరి నిమిషం టెన్షన్లు.. ఇవన్నీ దాటుకుని సినిమా థియేటర్లలోకి వచ్చింది. మామూలుగా అయితే ఇన్ని అవాంతరాలు వస్తే సినిమా మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. కానీ బాలయ్య విషయంలో సీన్ రివర్స్ అయ్యింది.

​నిజానికి సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే బయట వినిపిస్తున్న టాక్ వేరు, గ్రౌండ్ లెవెల్ లో కనిపిస్తున్న రియాలిటీ వేరు. క్రిటిక్స్ నుంచి, సోషల్ మీడియా రివ్యూల నుంచి మిక్స్ డ్ టాక్ వస్తోంది. దర్శకుడు బోయపాటి శ్రీను కథ మీద కంటే, కేవలం ఎలివేషన్ల మీదే ఎక్కువ ఫోకస్ పెట్టారని, ప్రెజెంటేషన్ ఇంకా బాగుండాల్సిందని టాక్ కూడా ఉంది. సాధారణంగా ఇలాంటి టాక్ వస్తే బుకింగ్స్ డల్ అయిపోతాయి.

​కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. బయట టాక్ ఎలా ఉన్నా, ఆన్ లైన్ బుకింగ్స్ మాత్రం సాలీడ్ గానే ఉన్నాయి. బుక్ మై షో ట్రెండింగ్ చూస్తే ఎవరికైనా షాక్ అవ్వాల్సిందే. గంటకు ఏకంగా 21 వేల టికెట్లు అమ్ముడవుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి ఏం అర్థమవుతోంది? మాస్ ఆడియెన్స్ కు రివ్యూలతో పనిలేదు, వాళ్లకు కావాల్సింది బాలయ్య విశ్వరూపం మాత్రమే. అఖండ అనే బ్రాండ్ మీద ఉన్న నమ్మకం రివ్యూలను డామినేట్ చేస్తోంది.

​ఇక నైజాం ప్రీమియర్స్ కలెక్షన్స్ గట్టిగానే ఉండడం మరో హైలెట్. రాత్రికి రాత్రి షోలు కన్ఫర్మ్ అయినా, జనం ఎగబడి టికెట్లు కొన్నారు. టాక్ ప్రకారం కేవలం నైజాం ప్రీమియర్స్ నుంచే దాదాపు రూ. 2.3 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. టాక్ తో సంబంధం లేకుండా ఈ రేంజ్ ఓపెనింగ్స్ రావడం అంటే అది బాలయ్య స్టామినాకు నిదర్శనం. అలాగే సోషల్ మీడియా నెగటివిటీ థియేటర్ గేట్ల బయటే ఆగిపోయిందని ఈ నెంబర్లు చెబుతున్నాయి

​అయితే ఓపెనింగ్స్ బాగున్నాయని రిలాక్స్ అవ్వడానికి లేదు. ఎందుకంటే ఇది బాలయ్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా. బయ్యర్లు సేఫ్ అవ్వాలంటే ఇది కచ్చితంగా బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కావాలి. ఆల్ టైమ్ రికార్డులు కొడితే తప్ప గట్టెక్కలేరు. కేవలం బాలయ్య ఇమేజ్, యాక్షన్ ఎపిసోడ్స్ మీద ఆధారపడిన ఈ సినిమా, లాంగ్ రన్ లో ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఎంతవరకు మెప్పిస్తుందనే దాని మీదే అసలు ఫలితం ఆధారపడి ఉంటుంది.

Tags:    

Similar News