హాలీవుడ్ లోకి మరో బాలీవుడ్ స్టార్.. సరైన పాత్ర దక్కినట్లు ఉందే!

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చెందిన అనేక మంది నటీనటులు.. ఇప్పటికే హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.;

Update: 2025-12-12 11:28 GMT

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చెందిన అనేక మంది నటీనటులు.. ఇప్పటికే హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్ సహా పలువురు ఇప్పటికే హాలీవుడ్ చిత్రాల్లో క్యామియో రోల్స్ చేశారు. వివిధ చిత్రాల్లో నటించి తమ యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు.




 


ఇప్పుడు మరో నటుడు విద్యుత్ జమ్వాల్ అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆయన.. ఇప్పుడు హాలీవుడ్ లో అడుగు పెట్టనున్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న వీడియో గేమ్ ఆధారంగా తెరకెక్కుతున్న స్ట్రీట్ ఫైటర్ అనే అమెరికన్ మార్షల్ ఆర్ట్స్ మూవీలో కీలక పాత్రలో కనిపించనున్నారు.

కిటావో సకురాయి దర్శకత్వం వహిస్తున్న ఆ భారీ యాక్షన్ మూవీ నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్.. అందరినీ ఆకట్టుకున్నాయి. అందులో ముఖ్యంగా విద్యుత్ జమ్వాల్ లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ధల్సిమ్ గా సినిమాలో కనిపించనున్న విద్యుత్ జమ్వాల్ మేకోవర్.. ఒక్కసారిగా సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించిందనే చెప్పాలి.

అయితే ఫస్ట్ లుక్ లో విద్యుత్.. పూర్తి హెయిర్ షేవ్ తో కనిపించారు. భారతీయ యోగి రూపానికి తగ్గట్టుగా మేకోవర్ చేసుకుని షాకిచ్చారు. వీడియో గేమ్స్ ప్రపంచంలో విపరీతమైన పేరు తెచ్చుకున్న ధల్సిమ్ పాత్రను ఆయన పోషించడం ప్రత్యేకంగా నిలిచింది. ఆ రోల్ కు కంప్లీట్ ఫిజికల్ ఫిట్‌ నెస్, యాక్షన్ ఫ్లూయిడిటీ, బాడీ కంట్రోల్ వంటి లక్షణాలు అవసరం.

ఇప్పటికే యాక్షన్ సినిమాల్లో అద్భుత స్టంట్స్ ను ప్రదర్శించిన విద్యుత్ జమ్వాల్ ఈ పాత్రకు సరిగ్గా సెట్ అయ్యాడనే అభిప్రాయం ఇప్పుడు అభిమానుల్లో వ్యక్తమవుతోంది. ధల్సిమ్ పాత్రకు పర్ఫెక్ట్ ఫిట్ విద్యుత్ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. హాలీవుడ్ లో దుమ్మురేపి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని, భారత్ కు గర్వకారణం గా నిలవాలని కోరుకుంటున్నారు.

ఇక స్ట్రీట్ ఫైటర్ మూవీ విషయానికొస్తే.. విద్యుత్ జమ్వాల్‌ తో పాటు పలువురు ప్రముఖ హాలీవుడ్ నటులు నటిస్తున్నారు. వారిలో నోహా సెంల్టినియో, ఆండ్రూ కోజీ, కాలినా లియాంగ్, రోమన్ రేన్స్, డేవిడ్ డాస్ట్‌మాల్చియన్, కోడి రోడ్స్, ఆండ్రూ షుల్జ్, ఎరిక్ ఆండ్రే, జేసన్ మొమోవా వంటి స్టార్ నటులు ఉన్నారు. వచ్చే ఏడాది అక్టోబర్ 16వ తేదీన మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా.. ధల్సిమ్ రోల్ లో విద్యుత్ ఎలా మెప్పిస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News