అఖండ 2 ఆడుతుంటే.. హఠాత్తుగా వచ్చిన రాజసాబ్
సాధారణంగా సినిమా ప్రమోషన్స్ అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలు లేదా సోషల్ మీడియాలో పోస్టర్లు రిలీజ్ చేయడం చూస్తుంటాం.;
సాధారణంగా సినిమా ప్రమోషన్స్ అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలు లేదా సోషల్ మీడియాలో పోస్టర్లు రిలీజ్ చేయడం చూస్తుంటాం. కానీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'ది రాజా సాబ్' టీమ్ మాత్రం రూటు మార్చింది. థియేటర్లో మాస్ సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకులకు ఊహించని షాక్ ఇచ్చి, తమ సినిమా మీద అటెన్షన్ క్రియేట్ చేసుకుంది. ఈరోజు రిలీజ్ అయిన బాలకృష్ణ 'అఖండ 2' సినిమా స్క్రీనింగ్ సమయంలో ఓ కిక్ ఇవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
అసలు ఏం జరిగిందంటే.. థియేటర్లో 'అఖండ 2' సినిమా ప్రదర్శన జరుగుతుండగా, సడన్ గా స్క్రీన్ బ్లాంక్ అయిపోయింది. కరెంట్ పోయిందేమో లేదా టెక్నికల్ సమస్య వచ్చిందేమో అని జనం కంగారు పడేలోపే.. థియేటర్ మొత్తం చిమ్మ చీకటి అలుముకుంది. ఆ వెంటనే ఆడియెన్స్ చేతిలో ఉన్న బ్యాండ్స్ నుంచి, ఫోన్ల నుంచి లైట్లు వెలుగుతూ ఒక వింతైన వాతావరణం క్రియేట్ అయ్యింది. ఈ చీకటి, ఆ వెలుగుల మధ్య పిల్లి హర్రర్ సౌండ్స్ వచ్చాయి.
సరిగ్గా అప్పుడే స్క్రీన్ మీద ఒక టీజర్ ప్లే అవ్వడం మొదలైంది. బ్యాక్ గ్రౌండ్ లో విచిత్రమైన శబ్దాలు, హార్రర్ థీమ్ మ్యూజిక్ వినిపిస్తుండగా.. స్క్రీన్ మీద మెరుపులు మెరిసినట్లు విజువల్స్ వచ్చాయి. చివర్లో 'ది రాజా సాబ్' అనే టైటిల్ లోగో రివీల్ అవ్వగానే థియేటర్ దద్దరిల్లిపోయింది. ప్రభాస్ సినిమా అని తెలియగానే ఫ్యాన్స్ కేకలతో రచ్చ చేశారు. ఒక హార్రర్ సినిమాకు ఇంతకంటే బెస్ట్ ఇంట్రడక్షన్ ఏముంటుంది?
ప్రస్తుతం థియేటర్లకు వచ్చే ఆడియెన్స్ మూడ్ మాస్ వైబ్ లో ఉంది. అఖండ 2 కోసం వచ్చేది పక్కా మాస్ ఆడియెన్స్. వాళ్ళను టార్గెట్ చేయడానికి ఇంతకంటే మంచి వేదిక దొరకదు. పైగా సినిమా జానర్ హార్రర్ కామెడీ కాబట్టి, ఆ చీకటి థీమ్, ఆ సడన్ సర్ ప్రైజ్ ఎలిమెంట్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. పోస్టర్ రిలీజ్ చేస్తే చూసి వదిలేస్తారేమో కానీ, ఇలాంటి లైవ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తే అది చాలా కాలం గుర్తుండిపోతుంది.
ఈ చిన్న గ్లింప్స్ లోనే సినిమా రిలీజ్ డేట్ ను కూడా అధికారికంగా ప్రకటించేశారు. 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా ఈ సినిమా రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మీద ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ యూనిక్ ప్రమోషన్ తో ఆ అంచనాలు డబుల్ అయ్యాయి.