బాలీవుడ్‌కు దురంధర్ చేసిన డ్యామేజ్

Update: 2025-12-12 12:19 GMT

కొన్నేళ్లుగా సౌత్ సినిమాల ఆధిపత్యాన్ని తట్టుకోలేకపోతున్న బాలీవుడ్.. 2025లో మాత్రం నిలకడగా బ్లాక్ బస్టర్లు కొడుతూ సంతృప్తికరంగా ఏడాదిని ముగించబోతోంది. రణ్వీర్ సింగ్ సినిమా ‘దురంధర్’ 2025కు అదిరిపోయే ముగింపునిచ్చింది. గత వారం విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుని వీకెండ్లో భారీ వసూళ్లు సాధించింది. ఆ తర్వాత కూడా ఆ సినిమా జోరు తగ్గలేదు.

వీక్ డేస్‌లోె కూడా వీకెండ్ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తూ ముందుకు సాగింది. రెండో వీకెండ్లో కొత్త చిత్రం స్థాయిలో వసూళ్లు రాబట్టేలా ఉంది. ‘దురంధర్’ ఊపు చూస్తుంటే ఫుల్ రన్లో 500 కోట్ల వసూళ్ల మార్కును అందుకునేలా ఉంది. సినిమా సక్సెస్ కావడం ఒకెత్తయితే.. బాలీవుడ్లో ఒక పెద్ద చర్చకు తెరతీసింది ‘దురంధర్’. ఎన్నో ఏళ్ల నుంచి ప్రేక్షకులను ఒక భ్రమలో పెడుతూ వస్తున్న బాలీవుడ్ ఫిలిం మేకర్లకు దర్శక నిర్మాత ఆదిత్య ధర్.. పెద్ద ఝలక్ ఇచ్చాడనే డిస్కషన్ నడుస్తోంది.

కేంద్రంలో అధికారంలోకి ఉన్న బీజేపీకి విధానాలకు తగ్గట్లుగా ‘దురంధర్’ను ఒక ప్రాపగండా మూవీ అనే ముద్ర వేసే ప్రయత్నం జరుగుతున్నప్పటికీ.. ప్రేక్షకుల ఆలోచన అలా లేదు. ఎప్పుడూ పాకిస్థాన్ అసలు స్వరూపాన్ని చూపించడకుండా కొంచెం పాజిటివ్ కోణంలో ప్రెజెంట్ చేయడం.. భారత్ నాశనాన్ని కోరుకునే ఐఎస్ఐని కూడా అలాగే చూపించడం.. ‘రా’తో ఐఎస్ఐ కలిసి పని చేసేట్లుగా కథలు, పాత్రలు రాయడం.. ‘రా’లో దేశద్రోహులున్నట్లు చూపించడం.. ఇలాంటి వ్యవహారాలే ఉండేవి చాలా బాలీవుడ్ సినిమాల్లో. పాకిస్థాన్‌లో తమ సినిమాలను రిలీజ్ చేసి వసూళ్లు రాబట్టుకోవడం కోసం.. గల్ఫ్ కంట్రీస్ ఆడియన్సుని కూడా మెప్పించడం కోసం చాలామంది బాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఈ శైలినే అనుసరించేవారు.

కానీ ‘దురంధర్’లో పాకిస్థాన్, ఐఎస్ఐ, అక్కడి ఉగ్రవాదుల నిజ స్వరూపాన్ని కళ్లకు కట్టినట్లు చూపించడం ద్వారా ప్రేక్షకులకు అసలు కోణాన్ని పరిచయం చేశాడు ఆదిత్య ధర్. ఆడియన్స్ దీనికి బాగా కనెక్ట్ అవుతున్నారు కూడా. వేరే చిత్రాల్లో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగినప్పటికీ.. ‘దురంధర్’ను ఒక గేమ్ చేంజర్‌గా చెప్పొచ్చు. ఇంతకుముందులా పాకిస్థాన్‌ను రొమాంటిసైజ్ చేయాలని చూసినా.. ఐఎస్ఐని పాజిటివ్ కోణంలో చూపించాలని ట్రై చేసినా ప్రేక్షకులు తిప్పి కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ రకంగా చాలామంది బాలీవుడ్ ఫిలిం మేకర్లకు ఆదిత్య పెద్ద స్పీడ్ బ్రేక్ వేసినట్లే.



Full View


Tags:    

Similar News