వాళ్లిద్దరూ వాటేసుకోవడమే హైలైట్..

Update: 2016-01-09 17:30 GMT
బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ భార్య జయా బచ్చన్ కు - ఎవర్ గ్రీన్ అందాల నటి రేఖకు ఏమాత్రం పొసగదు అన్న విషయం అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరి మధ్యా ఏమాత్రం సఖ్యత లేదనే విషయం కూడా ప్రపంచానికి తెలుసు. మరి వీరిద్దరూ కౌగిలించుకోవడం అంటే అది ఏమాత్రం చిన్న విషయం కాదు.

1970ల్లో అమితాబ్ - రేఖల మధ్య ప్రేమాయణం జోరుగానే సాగింది. అసలు వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారని బాలీవుడ్ మొత్తం అనుకుంది. అయితే.. అమితాబ్ - జయబాధురితో కూడా కలిపి ట్రయాంగిల్ లవ్ స్టోరీ రన్ చేశాడంటారు. ఏమైతేనేం చివరకు అమితాబ్ ను చేసుకుని జయాబచ్చన్ గా మారిపోయింది జయబాధురి. ఆ తర్వాత అమితాబ్ - రేఖలు కలిసి ఒక సినిమా కూడా చేయకపోవడానికి కారణం..  జయ విధించిన కండిషనే అంటారు. అయితే.. ఇన్నేళ్లలో ఎపుడూ జయాబాధురి, రేఖల మధ్య సాన్నిహిత్యం ఏర్పడలేదు. కానీ ఇప్పుడు మాత్రం సడెన్ గా ఓ అవార్డ్ ఫంక్షన్ లో జయాబచ్చన్, రేఖలు ఒకరినొకరు కౌగిలించుకుని కనిపించడం హాట్ టాపిక్ అయిపోయింది.

స్టార్ స్క్రీన్ అవార్డ్స్ 2016లో పక్కపక్కనే కూర్చున్న వీరిద్దరు మాట్లాడుకోవడమే కాదు.. ఒకరినొకరు కౌగిలించుకుని కనిపించారు. దీంతో వీరి మధ్య ఉన్న విబేధాలకు చెక్ పడ్డట్టే అంటున్నారు. ఈ రిలేషన్ ఇలా కంటిన్యూ అయితే మాత్రం.. అమితాబ్ - రేఖలను జంటగా చూసే అవకాశం మరోసారి ప్రేక్షకులకు వస్తుందేమో.
Tags:    

Similar News