ఎవరో ఏదో అన్నారని పట్టించుకుంటే ఈ లైఫ్ నీది కాదు!
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ .. ప్రస్తుతం ఈ పేరు ఇంటా బయటా మార్మోగుతోంది. అటు ఉత్తరాది ఇటు దక్షిణాది సినిమాలతో క్షణం తీరిక లేనంత బిజీగా కెరీర్ ని సాగిస్తున్న ఈ శ్రీలంకన్ బ్యూటీకి మునుముందు సౌత్ లో ఫ్యాన్ బేస్ పెరగనుంది. ఇప్పటికే ప్రభాస్ సాహోతో ఇక్కడ ఓ ఊపు ఊపింది. బ్యాడ్ బోయ్ అంటూ జాకీ ఇచ్చిన ట్రీట్ కి బోయ్స్ కిల్ అయ్యారిక్కడ.
ప్రతిసారీ సోషల్ మీడియాల్లో బోల్డ్ ఫోటోషూట్లతో విరుచుకుపడుతూ ఫాలోవర్స్ ని పెంచుకోవడంలోనూ ఈ బ్యూటీ పెద్ద సక్సెసైంది. తాజాగా అదిరిపోయే బోల్డ్ షిమ్మరీ డ్రెస్ లో రకరకాల భంగిమల్లో కెమెరాకు ఫోజులిచ్చింది ఈ బ్యూటీ. ఇన్ స్టాలో జాకీ షేర్ చేసిన లేటెస్ట్ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోకి జాకీ ఆసక్తికర క్యాప్షన్ ని ఇచ్చింది.ఎవరో ఏదో అన్నారని పట్టించుకుంటే ఈ జీవితం నీది కాదు! అంటూ శీర్షికను ఇవ్వగా దానికి అభిమానులు ఫైర్ ఈమోజీల్ని షేర్ చేస్తున్నారు.
అంతేకాదు తన అందం వెనక సీక్రెట్ ని కూడా రివీల్ చేసింది. తను అడిక్ట్ అయిన బ్యూటీ ఉత్పత్తులను వెల్లడించింది! జాకీ లుక్ నిజానికి చాలా క్యాచీగా ఉంది. జాక్విలిన్ అభిమానులు .. అనుచరులు ఆమె ఉనికిని పనిని చూసి మంత్రముగ్ధులై ఉంటారు. ఇటీవల జాక్వెలిన్ నవంబర్ 2021 `కాస్మోపాలిటన్ ఇండియా` సంచికలో ప్రదర్శితమైంది. కవర్ స్టోరీలో ప్రస్తుతం తన అందం వెనక సౌందర్య ఉత్పత్తుల గురించి మాట్లాడింది.
కాస్మోపాలిటన్ తన ఇటీవలి ఫేవరెట్ బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి అడిగినప్పుడు Ms ఫెర్నాండెజ్ ``నా కలెక్షన్ నుండి కలర్ బార్ సిన్ లిప్ స్టిక్ కి నేను అడిక్ట్ అయ్యాను - అవి మృదువుగా ఉంటాయి. చాలా విలాసవంతంగా అనిపిస్తాయి. అప్పుడు గ్లో విత్ లవ్ హైలైటర్ నా గో-టు ప్రోడక్ట్. షీర్ షీన్.. చర్మ సంరక్షణలో కలర్ బార్ అందించే బ్లూ లైట్ డిఫెన్స్ రేంజ్ ని నేను ఇష్టపడుతున్నాను. నేను గడిపే సమయాన్ని బట్టి.. నా చర్మాన్ని రక్షించుకోవడానికి నాకు ఈ ఉత్పత్తులు అవసరం`` అని తెలిపింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తదుపరి రెండు చిత్రాలలో అక్షయ్ కుమార్ తో పాటు నటిస్తోంది. భారీ చిత్రాలు బచ్చన్ పాండే -రామ్ సేతులో కనిపించనుంది. రామ్ సేతులో జాకీతో పాటు నుష్రత్ భరూచా మరో నాయిక. అయితే బచ్చన్ పాండేలో జాక్వెలిన్ తో బాబీ డియోల్- క్రితి సనన్- పంకజ్ త్రిపాఠి - రితేష్ దేశ్‌ముఖ్ తదితరులు నటించారు. తెలుగులో ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి హరి హర వీర మల్లు చిత్రంలో నటిస్తోంది.
Full View