ఫోటో స్టొరీ: కిరాక్ పోజిచ్చిన కిక్ బ్యూటీ

Update: 2019-07-09 01:50 GMT
బాలీవుడ్ సినిమాలను ఫాలో అయ్యేవారికి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు తెలిసే ఉంటుంది.  పలు విజయవంతమైన హిందీ సినిమాలలో నటించింది ఈ శ్రీలంక బ్యూటీ.  రితేష్ దేశ్ ముఖ్.. అమితాబ్ బచ్చన్ నటించిన 'అలాదిన్' చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ 'హౌస్ ఫుల్' ఫ్రాంచైజీలో తెరకెక్కిన కొన్ని సినిమాలతో పాటుగా సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ ఫిలిం 'కిక్' లో కూడా నటించింది. ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఇన్స్టా గ్రామ్ లో 30 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారంటే ఎంత పాపులరో మనం అర్థం చేసుకోవచ్చు.

వారి కోసమే రెగ్యులర్ గా హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ మురిపిస్తూ ఉంటుంది.  తాజాగా ఒక ఫోటోను పోస్ట్ చేసిన జాక్వెలిన్ "హాయ్ బేబీస్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. హాయిగా ఒక దిండుపై తలపెట్టుకొని ఒక సెల్ఫీ తీసుకుంది. ఉమ్మ.. అంటూ మూతిని రౌండ్ గా తిప్పిమరీ ఒక చిలిపి ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. ఎల్లో టాప్ వేసుకున్నప్పటికీ లోపల ఉండే వైట్ ఇన్నర్ కనిపిస్తూ ఉంది.  ఎన్ని ఉన్నా అందాల విందు ఆటోమేటిక్ గా జరిగిపోయింది.  హెయిర్ స్టైల్ కూడా డిఫరెంట్ గా ఉంది. ఏదైతేనేం ఈ బ్యూటీ తన హాటు సెల్ఫీతో నెటిజన్లకు ఆనందాన్ని పంచింది.

ఈ ఫోటోకు 1.5 మిలియన్ లైక్స్ వచ్చాయి.  బాలీవుడ్ బ్యూటీ ఫాతిమా సనా షేక్ కూడా ఈ ఫోటోకు లైక్ కొట్టింది.  ఇక కామెంట్స్ కైతే లెక్కే లేదు.  "ప్రెట్టియస్ట్ ఏంజెల్".. "నువ్వు ఒక టైమ్ లెస్ బ్యూటీ".. "తూ మారేగి బచ్చోంకో".. "హాటెస్ట్ బాలీవుడ్ బ్యూటీ" అంటూ కామెంట్లు పెట్టారు. ఇక జాక్వెలిన్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'డ్రైవ్' అనే సినిమాలో నటిస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఈ సినిమాలో హీరో కాగా తరుణ్ మన్ సుఖాని దర్శకుడు.  కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.


Tags:    

Similar News