జాను.. బ్రేక్ ఈవెన్ కు ఇంకా 12 కోట్లు తేవాలి!
తమిళంలో క్లాసిక్ గా పేరుతెచ్చుకున్న '96' సినిమాకు రీమేక్ గా 'జాను' తెరకెక్కిన సంగతి తెలిసిందే. సమంతా - శర్వానంద్ ప్రధాన పాత్రల్లో ఒరిజినల్ దర్శకుడు సీ. ప్రేమ్ కుమార్ రూపొందించిన ఈ సినిమాకు తెలుగులో మాత్రం ఆశించిన స్పందన దక్కలేదు. సినిమాకు డీసెంట్ రివ్యూస్.. మౌత్ టాక్ వచ్చినప్పటికీ అవి వసూళ్ల రూపంలోకి మారడం లేదు.
సమంతా.. శర్వానంద్ లాంటి పాపులర్ నటీనటులు నటించిన సినిమా అయినా ప్రేక్షకులు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. పోనీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ పోటీ ఉందా అనుకుంటే అదీ లేదు. 'జాను' మొదటి నాలుగు రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా రూ.7.24 కోట్ల షేర్(రూ.13.15 కోట్లు) సాధించింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ. 19.20 కోట్లు. ఈ లెక్కన 'జాను' బ్రేకీవెన్ అయ్యేందుకు మరో రూ.11.96 కోట్ల షేర్ సాధించాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న కలెక్షన్స్ ట్రెండ్ చూస్తుంటే ఈ కలెక్షన్స్ సాధించడం కష్టమని.. ఈ సినిమా డిజాస్టర్ దిశగా పయనిస్తున్నట్టేనని అంటున్నారు.
దిల్ రాజు సినిమాలకు దాదాపుగా అందరూ రెగ్యులర్ బయ్యర్లే ఉంటారు. అందుకే ఈ సినిమాకు వచ్చే నష్టాలను బయ్యర్ల కు దిల్ రాజు బ్యానర్ లో రాబోయే నెక్స్ట్ సినిమాకు ఎడ్జస్ట్ చేస్తారని అంటున్నారు. ఏదేమైనా ఒక తమిళంలో క్లాసిక్ గా పేరుతెచ్చుకున్న '96' తెలుగులో ఇలా చతికిలపడడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.