• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్రైలర్ టాక్: సస్పెన్స్...

ట్రైలర్ టాక్: సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ గా 'ఇష్క్' నాట్ ఏ లవ్ స్టోరీ..!

By - Tupaki Desk
Update: 2021-07-27 05:56 GMT
'జాంబిరెడ్డి' సినిమాతో హీరోగా సక్సెస్ ఫుల్ గా లాంచ్ అయిన తేజ సజ్జ.. ఇప్పుడు ''ఇష్క్'' మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 'నాట్ ఏ లవ్ స్టోరీ' అనేది దీనికి ట్యాగ్ లైన్. అదే పేరుతో వచ్చిన మలయాళ చిత్రానికి ఇది అధికారిక తెలుగు రీమేక్. ఎస్‌.ఎస్‌. రాజు అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని జూలై 30న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్.. తాజాగా 'ఇష్క్' ట్రైలర్ ను విడుదల చేశారు.

'నా పేరు సిద్ధు' అని తేజ సజ్జ పరిచయం చేసుకుంటూ ఓ ఇంట్లోకి వెళ్లడంతో ట్రైలర్ ప్రారంభమైంది. దేని గురించో తెలుసుకోడానికి అతను అక్కడికి వెళ్ళినట్లు అర్థం అవుతోంది. ఇక హీరోయిన్ తో ప్రేమలో ఉన్న తేజ.. ఆమె బర్త్ డే ప్లాన్స్ లో భాగంగా కారులో వెళ్తుండగా.. ఏదో ఊహించని ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తేజ దేని కోసమో వెతుకుతున్నట్లు.. అతన్ని ఎవరో టార్గెట్ చేసి వెంబడిస్తున్నట్లు ట్రైలర్ లో చూపించారు.

'ఇష్క్' ప్రేమ కథ కాదని చెబుతూ వచ్చిన మేకర్స్.. స్టోరీ ఇదని హింట్ ఇవ్వకుండా ట్రైలర్ ని ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు. అయితే ఇదొక సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పే ప్రయత్నం చేశారు. దీనికి మహతి స్వరసాగర్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ మరియు శ్యామ్ కె. నాయుడు కెమెరా వర్క్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రానికి వ‌ర‌ప్ర‌సాద్ ఎడిటింగ్ వర్క్ చేయగా.. విఠ‌ల్ కొస‌నం ఆర్ట్ డైరెక్ట‌ర్‌ గా పని చేశారు.

కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద ఏర్పడిన పరిస్థితుల్లో ధైర్యం చేసి థియేటర్లలోకి వస్తున్న మొదటి సినిమా 'ఇష్క్'. చాలా ఏళ్ళ తర్వాత మెగా సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌ బ్యానర్ పై ఆర్.బి. చౌదరి సమర్పిస్తున్న తెలుగు సినిమా ఇది. ఎన్వీ ప్రసాద్‌ - పారస్‌ జైన్‌ - వాకాడ అంజన్‌ కుమార్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి వస్తున్న ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.



Full View


Tags:    
  • Ishq Movie Trailer 
  • Teja Sajja Ishq Movie Trailer 
  • Ishq Movie 
  • Ishq Movie Release Date 
  • Priya Varrier 
  • Mahathi Swara Sagar 
  • ISHQOnJuly30 

Similar News

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

2028 లో రెండు సినిమాల‌తో డార్లింగ్!

2026-11-02 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS