విజయ్ దేవరకొండ చెప్పింది నిజమేనా?
గత కొన్ని నెలల క్రితం వెబ్ మీడియాపై విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్నవేళ మధ్య తరగతి, బిలో మధ్య తరగతి .. ఆ కింది స్థాయి కుటుంబాలు దుర్భర జీవితాన్ని ఎదుర్కొన్నాయి. ఈ విషయాన్ని గ్రహించిన విజయ్ దేవరకొండ ఆ కుటుంబాలకు అండగా నిలవాలని `ది దేవరకొండ ఫౌండేషన్` పేరుతో అర్హులైన వారికి నిత్యావసరాలని అందించే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. దీనికి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభించడమే కాకుండా అదే స్థాయిలో దేవరకొండ ఫౌండేషన్ కు విరాళాలు కూడా అందాయి.
ఈ నేపథ్యంలో ఓ వర్గం వెబ్ మీడియా విజయ్ దేవరకొండని టార్గెట్ చేస్తూ విమర్శలు కురిపించింది. దీంతో మన స్థాపానికి గురైన విజయ్ దేవరకొండ తనని టార్గెట్ చేసిన వారిపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా ఆయన సినిమాల రేటింగ్ లపై కూడా ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. ప్రధాన వెబ్ మీడియాకు సంబంధించిన కొంత మంది కలిసి చర్చించుకున్న తరువాతే మూకుమ్మడిగా రేటింగ్‌లు ఇస్తుంటారని విమర్శలు చేశారు.
అదే విషయాన్ని తాజాగా ఇండస్ట్రీకి చెందిన కొంత మంది సెలబ్రిటీలు ఏ ఎంబీ మాల్ లో సినిమా చూస్తూ చర్చించుకోవడం ఆసక్తికరంగా మారింది. గతంలో విజయ్ దేవరకొండ చెప్పినట్టుగానే ఇటీవల ఏఎంబీ మాల్ లో ప్రధానమైన రెండు వెబ్ మీడియాలకు సంబంధించిన రివ్యూ రైటర్స్.. ఓ వెబ్ మీడియా ఓనర్ పక్క పక్కనే కూర్చుని ఇటీవల సినిమాలు చూశారని, రేటింగ్ లని ఇచ్చారని... తాజా చిత్రం `పుష్ప` ని కూడా ఇదే మాల్ లో పక్క పక్కనే కూర్చుని చూశారని... ఆ తరువాత చర్చించుకున్నాకే రేటింగ్ లని డిసైడ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోందని ఇండస్ట్రీకి చెందిన కొంత మంది సెలబ్రిటీలు గుసగుసలాడుతున్నారు. వీరి ఊహ నిజమా? అలా జరుగుతుందా? .. అని వీరి మాటలు విన్న కొంత పెదవి విరుస్తున్నారు.