బొమ్మ కనిపించేలా ఈ బాదుడేంది సారూ?
సినిమా.. సీరియల్.. షార్ట్ ఫిలిం.. ఇలా ఏదైనా సరే.. తీయాలంటే ఇప్పుడు చుక్కలు కనిపించాల్సిందే. సినీ నిర్మాతలకు సినిమా చూపించేలా ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు ఉన్నాయి. లొకేషన్ ఖర్చుల్ని భారీగా పెంచేస్తూ సర్కారు తీసుకున్న నిర్ణయం షాకింగ్ గా మారింది. ఇప్పటివరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏ రోడ్డు.. ఫ్లైఓవర్.. మార్కెట్లు.. ఇతర ప్రభుత్వ ప్రదేశాల్లో షూటింగ్ చేయాలంటే ప్రభుత్వానికి రూ.5వేల ఫీజు చెల్లిస్తే సరిపోయేది. అందుకు భిన్నంగా ఇప్పుడు రూ.30వేలు కడితే కానీ అనుమతి రాని పరిస్థితి.
భారీగా మొత్తాన్ని వసూలు చేస్తున్నప్పటికీ.. దానికి పరిమిత కాలానికి మాత్రమే అనుమతిని కుదించటం గమనార్హం. ఇప్పడు వసూలు చేసే రూ.30వేలకు కేవలం ఎనిమిది గంటలకు మాత్రమే అనుమతి ఇస్తారు. మరింత సమయం కావాలంటే.. మరికొంత చెల్లిస్తే కానీ.. అనుమతి సాధ్యం కాదట. తర్వాతి పెరిగే ప్రతి గంటకు రూ.4వేలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
ఒకవేళ షూటింగ్ కోసం పార్కులు.. గెస్టు హౌస్ లు.. రిజర్వాయర్లు.. ఆలయాలు లాంటి ప్రత్యేక లొకేషన్లలో జరిపితే అందుకు ప్రత్యేక ఫీజులు చెల్లించుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఏ ప్రాంతంలో షూటింగ్ చేస్తే ఎంత ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్న అంశంపై స్పష్టతను ఇచ్చింది ప్రభుత్వం.
జీహెచ్ఎంసీతో సహా రాష్ట్రంలోని 62 లొకేషన్లలో షూటింగ్ నిర్వహించాలంటేఎంత ఫీజు చెల్లించాలన్న అంశంపై ఫీజుల్ని డిసైడ్ చేశారు. ఈ జీవోను చూసిన నిర్మాతలంతా వణుకుతున్న పరిస్థితి. ఎందుకంటే.. లొకేషన్లకు అయ్యే ఖర్చే తడిచి మోపెడు అవుతుందని చెబుతున్నారు. ప్రభుత్వమే ఇంత భారీగా ఫీజులు వసూలు చేస్తే.. ప్రైవేటు భవనాల ఫీజులు మరెంత పెరుగుతాయో కదా? అని ప్రశ్నిస్తున్నారు.
తాజాగా పెంచిన ఫీజులు షూటింగ్ ఖర్చుల్ని భారీగా పెంచేస్తాయని.. సినిమా నిర్మాణం మీద ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. చిన్న సినిమాలపై దీని భారం భారీగా ఉంటుందని వాపోతున్నారు. ఏపీలో లొకేషన్ ఫీజులు లేవు. నాలుగు నెలల క్రితం లొకేషన్ ఫీజుల్ని అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది. అంతేకాదు.. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల పాటు అంటే పన్నెండు గంటల పాటు షూటింగ్ చేసుకునే వీలుంది. ఫ్రీగా పన్నెండు గంటలు షూట్ చేయటం మానేసి.. భారీగా ఫీజులు చెల్లిస్తూ..
ప్రదేశాల వారీగా పెరిగిన లొకేషన్ ఫీజుల చిట్టా చూస్తే.. కాలంతో పరుగులు తీసేలా ఫీజుల వడ్డన నిర్మాతలకు చుక్కలు తప్పవన్న మాట వినిపిస్తుంది. దీనిపై ప్రభుత్వం వెంటనే తగిన నిర్ణయం తీసుకోవాలంటున్నారు. లేని పక్షంలో చిన్న నిర్మాతలు రోడ్డు మీద పడటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.
ప్రదేశం పాత ఫీజు (రూ) కొత్త ఫీజు (రూ) (ప్రతి 8 గంటలకు)
సెంట్రల్ లైబ్రరీ 10 వేలు లక్ష
సంజీవయ్య పార్కు 10 వేలు 35 వేలు
జూపార్కు 10 వేలు 50 వేలు
అటవీ ప్రాంతాలు 5 వేలు 50 వేలు