కొడుకు ఎంట్రీ.. బాల‌య్య నిర్ణ‌యం స‌రైందేనా..?

Update: 2021-06-13 03:30 GMT
సినిమా ఇండ‌స్ట్రీలో వార‌సుల ఎంట్రీని ఎంత జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేస్తుంటారో అంద‌రికీ తెలిసిందే. ఇక‌, స్టార్ హీరోల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స్టోరీ మొద‌లు టెక్నీషియ‌న్స్ వ‌ర‌కు అన్ని విష‌యాల్లోనూ చాలా కాలిక్యులేటెడ్ గా ఉంటారు. ఇక అన్నింటిక‌న్నా ముఖ్య‌మైన పార్ట్ డైరెక్ష‌న్‌. సాధ్య‌మైనంత వ‌ర‌కు ప‌ర్ఫెక్ట్ ద‌ర్శ‌కుడిని వెతికి ప‌ట్టుకొని.. కుమారుడిని వారి చేతిలో పెడ‌తారు. గ్రాండ్ గా లాంచ్ చేయాల‌ని ఎంతో ఆరాట‌ప‌డుతుంటారు.

అయితే.. బాల‌య్య మాత్రం అందుకు భిన్న‌మైన ప్ర‌క‌ట‌న చేసి.. ఎవ్వ‌రూ ఊహించ‌ని షాక్ ఇచ్చారు. మెగాఫోన్ తానే ప‌ట్ట‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. త‌న కొడుకు సినిమాను తానే డైరెక్ట్ చేయ‌బోతున్న‌ట్టు చెప్పి సంచ‌ల‌నానికి తెర‌తీశార‌నే చెప్పొచ్చు. ఇటీవ‌ల ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఈ మేర‌కు ప్ర‌క‌టించారు బాల‌కృష్ణ‌.

అంతేకాదు.. క‌థ కూడా చెప్పేశారు. గ‌తంలో వ‌చ్చిన త‌న హిట్ మూవీ 'ఆదిత్య 369' సీక్వెల్ తో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్టు చెప్పారు బాల‌య్య‌. సినిమా ఎప్పుడు మొద‌లు పెడ‌తార‌నేది మాత్రం చెప్పలేదుగానీ.. తానే డైరెక్ట‌ర్ అని చెప్పి అంద‌రికీ షాకిచ్చార‌నే చెప్పొచ్చు.

ఈ ప్ర‌క‌ట‌న‌పై ఇండ‌స్ట్రీతోపాటు బాల‌య్య అభిమానుల్లోనూ చ‌ర్చ సాగుతోంది. బాల‌య్య తీసుకున్న నిర్ణ‌యం స‌రైందేనా? అని డిస్క‌స్ చేసుకుంటున్నారు. ఫ్యాన్స్ మాత్రం ఈ విష‌యంలో కాస్త టెన్ష‌న్ గానే ఉన్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి, అంతిమంగా ఇదే సాధ్య‌మ‌వుతుందా? బాలయ్య తీసుకున్న ఈ నిర్ణయమే ఫైనల్ అవుతుందా? భ‌విష్య‌త్ లో నిర్ణ‌యం మారుతుందా? అనేది చూడాలి.
Tags:    

Similar News