స్పై ఏజెంట్లు 'పఠాన్- టైగర్- కబీర్' ఒకే ఫ్రేమ్ లో?
కాంబినేషన్ తోనే కిక్కు! హృతిక్- టైగర్ కాంబినేషన్ ని కలిపి 'వార్' లాంటి మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్పై సినిమాని తెరకెక్కించాడు సిద్ధార్థ్ ఆనంద్. అది గ్రాండ్ సక్సెసైంది. ఆ తర్వాత కింగ్ ఖాన్ షారూఖ్- జాన్ అబ్రహాం- దీపిక లాంటి స్టార్ స్టడ్ కాంబోతో తెరకెక్కించిన 'పఠాన్' మైండ్ బ్లోవింగ్ హిట్ గా నిలిచింది. 'పఠాన్' బాలీవుడ్ కి 1000 కోట్ల క్లబ్ కలను నెరవేర్చనుందన్న టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉండగానే 'పఠాన్' సీక్వెల్ గురించి డిమాండ్ అభిమానుల్లో ఊపందుకుంది. ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని ఇప్పటికే దర్శకుడు హింట్ ఇచ్చాడు. ఇందులో విలన్ జాన్ అబ్రహాం చనిపోలేదు. అతడు గాల్లోంచి ఎగిరి లోయలోకి జారిపోయాడు అంతే...! ఆ తర్వాత అతడికి ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. అతడు తిరిగి బతికి రాడని గ్యారెంటీ ఏమీ లేదు! అంటే దీనర్థం సీక్వెల్ లో ఇంకా భీకరంగా తయారై శిష్య బృందంతో పఠాన్ పై ఎటాక్ స్టార్ట్ చేస్తాడన్న మాట. జాన్ అబ్రహాం శిష్య బృందంలోంచి హృతిక్ పుట్టుకొచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ తర్వాత టైగర్ కి కూడా చోటు కల్పించే వీలుందన్న ఊహాగానాలు సాగుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే పఠాన్ విశ్వం సంచలనాలకు కేంద్రబిందువుగా మారుతుందనడంలో సందేహం లేదు.
నిజానికి ధూమ్ ఫ్రాంఛైజీ తొలి భాగంలో జాన్ అబ్రహాం ఒక కీలక పాత్రలో నటించాడు. ఆ తర్వాత ఈ ఫ్రాంఛైజీలోకి హృతిక్ రోషన్ - అమీర్ ఖాన్ లాంటి స్టార్లు వచ్చి చేరారు. ఇప్పుడు ఇంచుమించు ఇలానే యూనివర్శ్ ట్రెండ్ లో ఏ హీరో ఎప్పుడు వచ్చి ఫ్రాంఛైజీలోకి చేరతాడో ఊహించలేం. ఇప్పుడు షారూఖ్- సల్మాన్ ఖాన్- హృతిక్- టైగర్ లాంటి స్టార్లు కలిసి ఒక సినిమాలో ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే అది ఏ రేంజులో ఉంటుందో ఊహించేందుకే మరో లెవల్ అనిపిస్తోంది. పఠాన్ లో షారూఖ్- సల్మాన్ ఖాన్ ట్రైన్ ఎపిసోడ్ ని అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. అంత అడ్వెంచరస్ ఎపిసోడ్ ని సిద్ధార్థ్ ఆనంద్ ఎంతో ఎగ్జయిట్ చేసేలా తెరకెక్కించాడు.
అందుకే ఇప్పుడు పఠాన్ విశ్వంలోకి హృతిక్ ప్రవేశం అనగానే అందరిలో ఉత్కంఠ మొదలైంది. అయితే హృతిక్ నిజంగానే ఈ ఫ్రాంఛైజీలోకి చేరుతున్నాడా? అంటే దానిగురించి ఇప్పుడే మాట్లాడడం తొందరపాటు అవుతుందని రచయిత అబ్బాస్ టైరేవాలా వెల్లడించారు. నిజానికి 'పఠాన్' లో హృతిక్ రోషన్ అతిధి పాత్రలో నటించకపోవడానికి కారణాన్ని కూడా రచయిత అబ్బాస్ టైరేవాలా వెల్లడించారు.
పఠాన్ రూపంలో షారుఖ్ ఖాన్ పునరాగమనం భారతదేశంలోనే కాకుండా విదేశాలలోను వేవ్స్ సృష్టిస్తోంది. పఠాన్ (షారూఖ్)కి సహాయం చేయడానికి టైగర్ ఫ్రాంచైజీ నుండి సల్మాన్ ఖాన్ టైగర్ గా భారీ యాక్షన్ సన్నివేశంలోకి ప్రవేశించడం చిత్రంలో అత్యంత ఎగ్జయిటింగ్ ఎపిసోడ్ గా మారింది.
పఠాన్.. టైగర్ సిరీస్ రెండూ యష్ రాజ్ ఫిల్మ్స్ సృష్టించిన ఒకే గూఢచారి విశ్వం నుండి వచ్చినవి కాబట్టి టైగర్ 'పఠాన్' సినిమాలోకి ప్రవేశించాడు. అదేవిధంగా హృతిక్ రోషన్ నటించిన వార్ కూడా అదే విశ్వానికి చెందినది. పైగా ఇదే బ్యానర్ సినిమా. అందువల్ల 'వార్' నుండి కబీర్ పాత్రధారి హృతిక్ కూడా పఠాన్ లో అతిధి పాత్రలో నటించాలని అంచనాలు ఉన్నాయి. కానీ అలా మొదటి పఠాన్ లో కుదరలేదు.
'పఠాన్'లో కబీర్ అతిథి పాత్ర గురించి మేకర్స్ లో ఎప్పుడైనా సృజనాత్మక చర్చ జరిగిందా? అని 'పఠాన్' డైలాగ్ రైటర్ అబ్బాస్ టైరేవాలాని ప్రశ్నించగా.. అతను ఏమన్నారంటే...అలా చేయడం సందర్భోచితం కాదని నేను భావిస్తున్నాను. అలాంటి చర్చ ఎప్పుడూ మామధ్య రాలేదు. ఇది కథలో భాగం కాదు... అని తెలిపాడు.
పఠాన్ - టైగర్ కలిసి బరిలోకి దిగడం అన్నది ఈ విశ్వాల (యూనివర్శ్) ను ఏకీకృతం చేయడంలో మొదటి మెట్టు! అని టైరేవాలా వివరించారు. పఠాన్ లో ఇరువురు ఖాన్ ల కలయిక చాలా సహజంగా జరిగిన ప్రక్రియ అని అతను చెప్పాడు. బహుశా ఏదో ఒక రోజు టైగర్ -కబీర్ (వార్-హృతిక్) లను కలిసి చూడాలనే ఆలోచన ... పఠాన్ - కబీర్ కలిసి అలాగే టైగర్ -పఠాన్ లను కలిసి చూడటం పెద్ద పండగలా ఉంటుంది. ఇద్దరు అగ్ర హీరోలను ఒకే సినిమాలో ఎందుకు అతిథులుగా ఉపయోగించాలి? అని టైరే వాలా ఎదురు ప్రశ్నించారు.
అయితే భవిష్యత్తులో పఠాన్ - టైగర్ సిరీస్ ల చిత్రాలలో హృతిక్ అతిథి పాత్రలో నటించే అవకాశం ఉందని టైరేవాలా సూచించాడు. అంటే షారూఖ్-సల్మాన్- హృతిక్ లను ఒకే ఫ్రేమ్ లో చూసేందుకు ఆస్కారం ఉంది. ఇప్పటికి మనమంతా ఇలాంటి ఒక ఎగ్జయిట్ మెంట్ ని కొంత నిలువరిద్దాం. యష్ రాజ్ రూపొందిస్తున్న గూఢచారి విశ్వంలో భవిష్యత్తులో వరుస సినిమాలు కొనసాగితే వాటిని అన్నింటినీ ఒకదానిలో ఒకటి మెర్జ్ చేయడానికి ప్రయత్నించడం కంటే ప్రతి సినిమాలో మనం ప్రత్యేక అతిథిని ప్రవేశ పెట్టడం ద్వారా ఎక్కువ థ్రిల్ పొందుతామని నేను నమ్ముతున్నాను'' అని రచయిత టైరేవాలా చెప్పాడు.
YRF స్పై యూనివర్స్ లో తదుపరి గూఢచారి చిత్రం సల్మాన్ 'టైగర్ 3' ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా సంచలనాలకు సిద్ధమవుతోంది. పఠాన్ రికార్డులను ఇది బ్రేక్ చేసే వీలుందని కూడా అంచనా. పఠాన్ లోని SRK పాత్ర తరహాలోనే టైగర్ కి సహాయం చేయడానికి షారూఖ్ బరిలోకొస్తాడు. దానికోసం టైగర్ 3 చిత్రంలో అతడు అతిధి పాత్రలో నటిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.