మన హీరోలకు పంచ్ వేసిన సల్మాన్ ఖాన్?

Update: 2020-04-30 06:30 GMT
లాక్ డౌన్ సమయం కాబట్టి ఎన్నో ఛాలెంజ్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  వాటిని సరదాగా చూసేవారు.. ఎంజాయ్ చేసేవారు చాలామందే ఉన్నారు కానీ ఈ ఛాలెంజ్ ల పై విమర్శలు కూడా ఉన్నాయి.  వాటిలో అధిక శాతం టైమ్ పాస్ స్టఫ్ అని.. వాటివల్ల సమాజానికి పైసా ఉపయోగం లేదని.. పైగా నష్టమని వారు వాదిస్తూ ఉన్నారు. తాజాగా సల్మాన్ ఖాన్ వేసిన ఓ ట్వీట్ చూసినవారు ఇలాంటి పిచ్చ ఛాలెంజ్ లకు పంచ్ వేశాడని అర్థాలు తీస్తున్నారు.

బాలీవుడ్ నటులు బాబా సిద్ధిఖి..  బాబా జీషాన్ అయూబ్ ఇద్దరూ కరోనా క్రైసిస్ వల్ల జరుగుబాటు లేక ఇబ్బంది పడుతున్న 1,25,000 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించారట.  ఈ విషయం తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలుపుతూ  సల్మాన్ "బాబా సిద్దిఖి.. జీషాన్ అయూబ్ ఎంతో గర్వంగా 1,25,000 కుటుంబాలకు నిత్యావసర సరుకులు  అందించారు.  ఇది కదా ఎవరైనా పాల్గొనాల్సిన నిజమైన ఛాలెంజ్ .. 'అన్నదానం ఛాలెంజ్'.  సొంతంగా చేయండి లేకపోతే.. మీకు నమ్మకం ఉన్నవారితో అయినా చేయండి" అంటూ ట్వీట్ చేశాడు.

సల్మాన్ ట్వీట్ చెయ్యడం ఆలస్యం.. ఇది పనికిమాలిన ఛాలెంజ్ లపై సల్లూ భాయ్ వేసిన పంచ్ అని కొందరు అర్థాలు తీయడం మొదలు పెట్టారు. సాధారణ సమయంలో ఒకేకానీ ఇలాంటి సంక్షోభ సమయంలో సమాజానికి  పనికొచ్చే ఛాలెంజ్ లు టేకప్ చెయ్యాలని ఇప్పటికే ఎంతో మంది నెటిజన్లు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. అయితే కొందరు సెలబ్రిటీలు మాత్రం ఎంత సేపూ అలాంటి ఛాలెంజిల వైపే మొగ్గు చూపిస్తుండడం గమనార్హం.  మరి సల్మాన్ తో ఈ పంచ్  ఆగుతుందా లేదా మిగతా హీరోలు కూడా అలా విమర్శలు చేస్తారా అన్నది వేచి చూడాలి.  ఈ విషయంపై ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ ఈ 'అన్నదానం ఛాలెంజ్' ను ఎక్కువ మంది స్వీకరించి తమకు తోచిన సహాయం చేస్తే అదే పదివేలు.  కనీసం కొందరికైనా ఈ కష్టకాలంలో సహాయం అందుతుంది.
Tags:    

Similar News