పూరీ 'రొమాంటిక్' ప‌రిస్థితి ఏంటి..?

Update: 2020-12-04 07:22 GMT
పూరీ జగన్నాథ్ తనయుడు పూరీ ఆకాష్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 'చిరుత' 'బుజ్జిగాడు' చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఆకాష్.. 'ఆంధ్రాపోరి' 'మెహబూబా' సినిమాలలో పూర్తి స్థాయి హీరోగా నటించాడు. అయితే ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దీంతో కొడుకుకి హిట్ ఇవ్వాలని డిసైడైన పూరీ 'రొమాంటిక్' సినిమాని లైన్ లో పెట్టాడు. దీనికి పూరీ జగన్నాథ్ కథ - స్క్రీన్ ప్లే - మాటలు అందించి, అనిల్ పాడూరికి దర్శకత్వ భాధ్యతలు అప్పగించాడు. పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై పూరీ జగన్నాథ్ - చార్మీ కలిసి నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న 'రొమాంటిక్' సినిమా రిలీజ్ పై ఇంతవరకు క్లారిటీ లేదు.

కోవిడ్ నేపథ్యంలో ఈ మధ్య తెలుగు సినిమాలు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే థియేటర్స్ రీ ఓపెన్ అవుతుండటంతో కొన్ని సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కి ముందుకొస్తున్నాయి. అయితే సమ్మర్ లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఆకాష్ 'రొమాంటిక్' మూవీని మాత్రం ఏ ఫార్మాట్ లో విడుద‌ల అవుతుందో అనే దానిపై స్పష్టత రాలేదు. పూరీ - ఛార్మీ థియేట‌ర్స్ ప‌రిస్థితి చూసి ఈ సినిమా పై ఓ నిర్ణయం తీసుకోవ‌డానికి ప్లాన్ చేసుకుంటున్నారని స‌మాచారం. కాగా, 'రొమాంటిక్' లో పూరీ ఆకాశ్‌ కు జోడీగా ముంబై ముద్దుగుమ్మ కేతికా శర్మ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ మంచి ఆదరణ తెచ్చుకున్నాయి. ఈ సినిమాతో పూరీ తనయుడు సూపర్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.
Tags:    

Similar News