బన్నీ చేసిన ఆ సాహసమే నాగ్‌ చేయబోతున్నాడా?

Update: 2020-08-10 10:30 GMT
నా పేరు సూర్య చిత్రంలో అల్లు అర్జున్‌ ఆర్మీ ఆఫీసర్‌ గా నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమాలో బన్నీ యాంగర్‌ మానేజ్‌ మెంట్‌ సమస్యతో బాధపడుతూ ఉంటాడు. దాని నుండి ఎలా బయట పడ్డాడు దాని వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనేది ఆ చిత్రం కథాంశం. ఒక తమిళ సినిమాలో కూడా విశాల్‌ ఇలాంటి సమస్యతో బాధపడుతూ ఉంటాడు. ఆర్మీ ఆఫీసర్స్‌ ఇంకా చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్స్‌ యాంకర్‌ మానేజ్‌ మెంట్‌ సమస్య ఉంటే ఎలాంటి పరిణామలు చవి చూడాల్సి వస్తుంది అనేది గతంలో చూశాం. ఇప్పుడు అదే కాన్సెప్ట్‌ తో నాగ్‌ సినిమా రూపొందుతున్నట్లుగా తెలుస్తోంది.

విలక్షణ చిత్రాల దర్శకుడిగా పేరున్న ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో నాగార్జున సినిమా కన్ఫర్మ్‌ అయిన విషయం తెల్సిందే. ఇటీవలే వీరి కాంబో మూవీ అధికారిక ప్రకటన వచ్చింది. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్స్‌ జరగడం లేదు. ఈ ఏడాది చివరి వరకు షూటింగ్స్‌ ప్రారంభం అయితే తన వైల్డ్‌ డాగ్స్‌ చిత్రాన్ని పూర్తి చేసి ఆ తర్వాత ప్రవీణ్‌ సత్తార్‌ మూవీని నాగ్‌ మొదలు పెట్టే అవకాశం ఉందంటున్నారు. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న లీక్స్‌ ప్రకారం నాగార్జున ఒక చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ గా కనిపించబోతున్నాడట.

ఆయన ఆవేశం కారణంగా కొన్ని తప్పులు జరుగుతాయి. దాంతో ఉన్నతాధికారులు ఆయనపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటీ నాగ్‌ ఆవేశం కారణంగా జరిగిన మంచి ఏంటీ చెడు ఏంటీ అనేది సినిమాలో ఆసక్తికరంగా చూపించబోతున్నారు. ఏషియన్‌ సునీల్‌ నిర్మించబోతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయనున్నారు. నాగ్‌ కమర్షియల్‌ సక్సెస్‌ కొట్టి చాలా కాలం అయ్యింది. మరి ఈ సినిమాతో అయినా ఆయన సక్సెస్‌ కొట్టేనా చూడాలి.
Tags:    

Similar News