స్టార్ హీరో అనారోగ్యం.. 2900 కోట్ల ఆస్తి తోబుట్టువులకు ధారాదత్తం!
చివరకు ప్రాణాపాయ స్థితి నుండి బయటపడి తిరిగి నటుడిగా కెరీర్‌ను కొనసాగిస్తున్న ఈ అగ్ర హీరో తన ఆస్తి పంపకాల విషయంలో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.;
ప్రముఖ స్టార్ హీరో దాదాపు రూ. 2900 కోట్ల సొంత ఆస్తిని తన నలుగురు తోబుట్టువులకు సమానంగా పంచేయాలని నిర్ణయించుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. నిత్యం వర్కవుట్లు చేస్తూ ఎంతో ఫిట్‌గా కనిపించే ఈ స్టార్ హీరో వెనుక ఒక విషాదకరమైన ఆరోగ్య సమస్య- సుదీర్ఘ పోరాటం ఉందన్న విషయం చాలామందికి తెలియదు. అతడు తన క్రమశిక్షణతో కూడిన జీవనశైలితో ఎందరికో స్ఫూర్తినిస్తున్నా.. ఒకానొక దశలో ఒక అరుదైన అనారోగ్యం `ఆత్మహత్య` అనే భయానక ఆలోచనల వైపు తీసుకెళ్లిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
గతంలో ఒక ఇంటర్వ్యూలో ఈ ప్రముఖ హీరో తనకు ఉన్న భయంకరమైన వ్యాధి గురించి సంచలన విషయాలను వెల్లడించారు. అతడు ట్రైజెమినల్ న్యూరల్జియా అనే అరుదైన నరాల వ్యాధితో బాధపడ్డారు. ఈ వ్యాధి వల్ల ముఖంలోని నరాల్లో విపరీతమైన నొప్పి వస్తుంది. ఆ నొప్పి ఎలా ఉంటుందంటే.. ముఖంపై ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్లుగా అకస్మాత్తుగా తీవ్రమైన బాధ కలుగుతుంది. ఆ యాతనను భరించలేక ఒకానొక సమయంలో ఎంతో మానసిక వేదనను అనుభవించానని చెప్పారు.
ఈ వ్యాధి తీవ్రత దృష్ట్యా, వైద్యులు అతడిని గట్టిగా అరవద్దని లేదా కోపగించుకోవద్దని హెచ్చరించారు. అలా చేయడం వల్ల మెదడులోని రక్తనాళాలు చిట్లే ప్రమాదం ఉందని భయపడే విషయం చెప్పారు. ఈ పరిస్థితిని `సూసైడ్ డిసీజ్` అని కూడా పిలుస్తారు.. ఎందుకంటే ఆ నొప్పి భరించలేక చాలామంది ఆత్మహత్యే శరణ్యమని భావిస్తుంటారు. ఈ సమస్య నుండి బయటపడటానికి ఆ ప్రముఖ స్టార్ హీరో అమెరికా వెళ్లి అత్యంత సంక్లిష్టమైన నరాల శస్త్రచికిత్సను చేయించుకున్నారు. అదృష్టవశాత్తూ ఆ ఆపరేషన్ విజయవంతం కావడంతో అతడు ప్రస్తుతం కోలుకున్నారు.
ఇక ఈ స్టార్ హీరో ఆస్తిపాస్తుల విషయానికి వస్తే.. దాదాపు రూ. 2900 కోట్ల సంపద ఉన్నట్లు అంచనా. సమాజ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే ఈ హీరో తన తదనంతరం ఆస్తిని తన నలుగురు సిబ్లింగ్స్‌కు (సోదర సోదరీమణులకు) సమానంగా పంచాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తన కుటుంబంపై అతడికి ఉన్న అపారమైన ప్రేమకు ఇది నిదర్శనం. తన సంపాదనలో సింహభాగాన్ని తన తోబుట్టువుల భవిష్యత్తు కోసం కేటాయించడం గొప్ప వ్యక్తిత్వానికి అద్దం పడుతోంది.
చివరకు ప్రాణాపాయ స్థితి నుండి బయటపడి తిరిగి నటుడిగా కెరీర్‌ను కొనసాగిస్తున్న ఈ అగ్ర హీరో తన ఆస్తి పంపకాల విషయంలో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అనారోగ్యంతో పోరాడి గెలిచిన అతడికి తన పెంపుడు చెల్లి అంటే రక్త సంబంధీకుల కంటే ఎక్కువ ఇష్టం. ఆమె పెళ్లి ని హైదరాబాద్ లో కోట్లు ఖర్చు చేసి మరీ చేసాడు. తన కుటుంబ సభ్యులందరూ ఆర్థికంగా స్థిరంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు తన ఆస్తి మొత్తాన్ని పంపిణీ చేయడానికి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడు బార్డర్ నేపథ్యంలో భారీ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు తన ఆరోగ్యం, కుటుంబ బాధ్యతల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.