బాల‌య్య సినిమా కూడా 'ధురంధ‌ర్‌' బాట‌లోనే..!

ప్ర‌స్తుతం గోపీచంద్ మ‌లినేని డైరెక్ష‌న్‌లో ఓ భారీ యాక్ష‌న్ డ్రామాని ప‌ట్టాలెక్కించిన బాల‌కృష్ణ ఇదే జోష్‌తో యంగ్ డైరెక్ట‌ర్ వివేక్ ఆత్రేయ‌తో ఓ భారీ సినిమాకు శ్రీ‌కారం చుట్ట‌బోతున్నాడు.;

Update: 2026-04-04 03:30 GMT

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డిపేస్తున్నారు. రీసెంట్‌గా బోయ‌పాటి శ్రీ‌ను డైరెక్ష‌న్‌లో చేసిన `అఖండ 2` ఆశించిన ఫ‌లితాన్ని రాబ‌ట్ట‌క‌పోవడంతో గేమ్ ప్లాన్ మార్చిన బాల‌య్య బ్యాక్ టు బ్యాక్ క్రేజీ సినిమాల‌ని లైన్‌లో పెట్టేశారు. మాస్ ప్రేక్ష‌కుల‌నే టార్గెట్‌గా పెట్టుకుని భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్‌ల‌కు ప్రాధాన్య‌త‌నిస్తూ వ‌చ్చిన బాల‌య్య ఇప్పుడు మాస్‌తో పాటు క్లాస్‌ని కూడా ఆక‌ట్టుకునే క‌థ‌ల‌ని ఎంచుకుంటూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు.

ప్ర‌స్తుతం గోపీచంద్ మ‌లినేని డైరెక్ష‌న్‌లో ఓ భారీ యాక్ష‌న్ డ్రామాని ప‌ట్టాలెక్కించిన బాల‌కృష్ణ ఇదే జోష్‌తో యంగ్ డైరెక్ట‌ర్ వివేక్ ఆత్రేయ‌తో ఓ భారీ సినిమాకు శ్రీ‌కారం చుట్ట‌బోతున్నాడు. `మెంట‌ల్ మ‌దిలో`, `అంటే సుంద‌రానికి`, స‌రిపోదా శ‌నివారం వంటి విభిన్న‌మైన సినిమాల‌తో ద‌ర్శ‌కుడిగా ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న వివేక్ ఆత్రేయ త‌న త‌దుప‌రి మూవీని నంద‌మూరి బాల‌కృష్ణ‌తో చేయ‌బోతున్నాడు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. చాలా కాలం త‌రువాత బాల‌య్య ఓ యంగ్ డైరెక్ట‌ర్‌కు చాన్స్ ఇవ్వ‌డంతో అంతా చ‌ర్చించుకుంటున్నారు.

`కురుక్షేత్రం` అనే ప‌వ‌ర్ ఫుల్ టైటిల్‌తో ఈ మూవీని చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌ని స్టార్ట్ చేసిన వివేక్ ఆత్రేయ దీన్ని మైథ‌లాజిక‌ల్ ట‌చ్‌తో అత్యంత భారీ స్థాయిలో చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక ఈ మూవీ కోసం మ‌ల‌యాళ స్టార్ హీరో మోహ‌న్‌లాల్‌ని ఓ కీల‌క పాత్ర కోసం రంగంలోకి దించేస్తున్నార‌ని, ఇప్ప‌టికే ఆయ‌న‌తో చ‌ర్చ‌లు జ‌రిపార‌ని, మోహ‌న్ లాల్ కూడా బాల‌య్య సినిమా కావ‌డంతో ఓకే చెప్పార‌ని ఇన్ సైడ్ టాక్‌.

ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్ట్‌పై ఆస‌క్తిక‌ర‌మైన వార్త‌లు షికారు చేస్తున్నాయి. ఈ మూవీని `ధురంధ‌ర్‌` త‌ర‌హాలో రెండు భాగాలుగా రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఫ‌స్ట్ పార్ట్ పూర్తి చేసి రెండ‌వ పార్ట్ కోసం టైమ్ తీసుకోకుండా `ధురంధ‌ర్‌` త‌ర‌హాలోనే రెండు భాగాల‌ని ఒకే టైమ్‌లో పూర్తి చేసి ఒక్కో పార్ట్‌ని రిలీజ్ చేయాల‌ని ప‌క్కా ప్లాన్‌తో వివేక్ ఆత్రేయ రెడీ అవుతున్నాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

బిగ్ స్టోరీ కావ‌డం, ఒకే పార్ట్‌లో స్టోరీని చెప్ప‌డం కుద‌ర‌క‌పోవ‌డంతో దీన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. భారీ బ‌డ్జెట్‌తో సెట్స్ పైకి వెళ్ల‌డానికి రెడీ అవుతున్న ఈ ప్రాజెక్ట్‌కు ఇప్ప‌టికే ప్రొడ్యూస‌ర్స్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ట‌. ద‌స‌రా త‌రువాత ఈ మూవీ షూటింగ్‌ని ప్రారంభించి ఒకేసారి పూర్తి చేయాల‌ని, ఎలాంటి గ్యాప్ లేకుండా రెండు భాగాల షూటింగ్‌ని పూర్తి చేయాల‌ని ప‌క్కా ప్ర‌ణాళిక‌తో టీమ్ ఉన్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News