లైంగిక ఆరోపణల నుంచి బటయ పడ్డ నటుడు!
మరోవైపు బ్లేక్ లైవ్లీ తన భర్త రేయాన్ రేనాల్డ్స్‌తో కలిసి ప్రమోషన్లలో పాల్గొంటూ జస్టిన్‌కు దూరంగా ఉంటూ వచ్చారు.;
హాలీవుడ్ స్టార్ నటి బ్లేక్ లైవ్లీ సహ నటుడు , దర్శకుడు జస్టిన్ బాల్డోని పై దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసులో ఆమెకు చట్టపరంగా ఎదురుదెబ్బ తగిలింది. ఇద్దరు కలిసి నటించిన `ఇట్ ఎండ్స్ విత్ అస్` సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన పరిణామాలపై బ్లేక్ చేసిన మెజారిటీ ఆరోపణలను న్యాయమూర్తి కొట్టివేశారు. దీంతో ఈ వివాదంలో జస్టిన్ బాల్డోని పక్షం బలపడినట్లయింది. కేసు వివరాల్లోకి వెళ్తే సినిమా సెట్స్‌లో జస్టిన్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని తన శరీర బరువు గురించి వ్యాఖ్యలు చేస్తూ ఇబ్బంది పెట్టారని బ్లేక్ లైవ్లీ గతంలో ఆరోపించారు.
ముఖ్యంగా ఒక సీన్ కోసం తనను ఎత్తే క్రమంలో జస్టిన్ ప్రవర్తన సరిగ్గా లేదని పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆమె సమర్పించిన ఆధారాలు , వాదనలు చట్టబద్ధంగా నిలబడలేవని అభిప్రాయపడుతూ చాలా వరకు క్లెయిమ్స్‌ను తోసిపుచ్చింది. వాస్తవానికి `ఇట్ ఎండ్స్ విత్ అస్` సినిమా నిర్మాణం , ప్రమోషన్ల సమయంలోనే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. సినిమా ప్రమోషన్ల కోసం ఈ జంట ఎక్కడా కలిసి కనిపించకపోవడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. జస్టిన్ బాల్డోనిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయన ఒక ప్రొఫెషనల్ పీఆర్ టీమ్‌ను కూడా నియమించుకున్నారు.
మరోవైపు బ్లేక్ లైవ్లీ తన భర్త రేయాన్ రేనాల్డ్స్‌తో కలిసి ప్రమోషన్లలో పాల్గొంటూ జస్టిన్‌కు దూరంగా ఉంటూ వచ్చారు.
న్యాయమూర్తి తాజా నిర్ణయంతో బ్లేక్ లైవ్లీ వేసిన కేసు బలహీనపడింది. కేవలం కొన్ని సాంకేతిక , చిన్నపాటి అంశాలపై మాత్రమే విచారణ కొనసాగే అవకాశం ఉందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ తీర్పు జస్టిన్ బాల్డోనికి పెద్ద ఊరటనిచ్చింది. జస్టిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ వివాదాలు ఆయన కెరీర్‌పై నీలి నీడలు కమ్మేలా చేశాయి.
హాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం తెరపై ఎంతటి విజయాన్ని అం దుకుందో? తెర వెనుక అంతకంటే పెద్ద వివాదాలకు కేంద్రబిందువైంది. బ్లేక్ లైవ్లీ ఆరోపణలు కోర్టులో వీగిపో వడంతో వివాదం ముగింపు దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. ఈ వివాదం బ్లేక్ లైవ్లీ కెరీర్‌పై కూడా కొంత ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సినిమా ప్రమోషన్ల సమయంలో ఆమె ప్రవర్తన , జస్టిన్‌తో ఉన్న విభేదాల పట్ల సోషల్ మీడియాలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
గృహ హింస వంటి సీరియస్ అంశంపై తీసిన ఈ సినిమా ప్రమోషన్లలో ఆమె గ్లామర్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనే విమర్శలు కూడా తెరపైకి వచ్చాయి. తాజాగా కోర్టు తీర్పు కూడా ఆమెకు వ్యతిరేకంగా రావడంతో వివాదం ఆమె ఇమేజ్‌ను ఏ మేరకు ప్రభావితం చేస్తుందో చూడాలి. ఏదేమైనా ఒక సూపర్ హిట్ సినిమా వెనుక ఇన్ని కోర్టు కేసులు, వ్యక్తిగత విద్వేషాలు ఉండటం హాలీవుడ్‌లో ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోనుంది.