మహేష్ గారు పిలవాలే కానీ పరిగెత్తుకెళతా!-అనీల్ రావిపూడి
వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు అనీల్ రావిపూడి. ఈవీవీ తర్వాత మళ్లీ కామెడీ ఎంటర్ టైనర్లలో ఆ లోటు తీరుస్తున్న దర్శకుడిగా తనకంటూ గౌరవం ఉంది. వరుసగా ఐదు సూపర్ హిట్లు అందించి స్పెషలిస్ట్ దర్శకుడిగా టాలీవుడ్ లో స్థిరపడిపోయారు రావిపూడి.
మహేష్ కథానాయకుడిగా ఆయన తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు 2020 సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అల వైకుంఠపురములో పోటీలో నిలిచినా సరిలేరు కలెక్షన్స్ పరంగా ఎక్కడా తగ్గలేదంటే కామెడీ ఎంటర్ టైనర్లకు ఉన్న డిమాండ్ అలాంటిది అని ప్రూవ్ అయ్యింది. సరిలేరు నీకెవ్వరు తర్వాత మరో ఆఫర్ ఇస్తున్నానని అనీల్ రావిపూడికి మహేష్ కమిటైన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా ఎప్పుడు చేస్తారు? అంటే.. దానికి అనీల్ రావిపూడి తాజా బర్త్ డే ఇంటర్వ్యూలో ఆన్సర్ చేశారు.
``మహేశ్` గారు అనిల్ అని పిలిస్తే చాలు.. నేను డోర్ తెరుచుకుని వెళ్లి ఆయన ముందు కూర్చుంటాను. ఆయన ఇంట్లో చెఫ్ స్నాక్స్ చేసి పెడతారు. అవి తింటూ ఆయనకు కథ చెప్పి సినిమా ఓకే చేయించుకుంటా. ఆయన ఎప్పుడంటే అప్పుడు సినిమా చేయడానికి నేను రెడీ. ఆయన పిలిస్తే పరిగెత్తుకెళుతాను`` అంటూ ఎగ్జయిట్ అయ్యారు రావిపూడి.
ప్రస్తుతం ఎఫ్ 3 సన్నాహకాల్లో ఉన్న అనీల్ తదుపరి తన స్నేహితుడు కృష్ణను నిర్మాతగా పరిచయం చేస్తూ క్రియేటివ్ సపోర్ట్ అందిస్తున్నాను. అతడి సాయంతో నిర్మాణ సంస్థను ముందుకు తీసుకెళతాం. నా కెరీర్ జర్నీలో ఎందర నిర్మాతలు నాకు అండగా నిలిచారు. కల్యాణ్‌రామ్ నుండి మహేశ్ బాబు వరకు నేను చేసిన ప్రతి సినిమా వాళ్లు నాపై పెట్టిన నమ్మకమే. ఈరోజు నేనున్న ఈ స్థాయికి కారణం నేను పనిచేసిన ప్రతిహీరో.. ప్రతి నిర్మాత.. దిల్ రాజు గారు,.. శిరీష్ గారు,.. అనీల్ సుంకర గారు... ప్రేక్షకులు.., నాతో ఉన్న టీమ్ అందరూ నన్ను నమ్మారు. సినిమా అనే అద్భుతమే నన్నింత వరకు నడిపించింది... అని తెలిపారు.