• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జాన్వీ అతడితో డేటింగ్ లో...

జాన్వీ అతడితో డేటింగ్ లో ఉందా..?

By - Tupaki Desk
Update: 2022-11-08 23:30 GMT
అలనాటి నటి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ఇంకా ఒక్క తెలుగు సినిమా కూడా చేయనప్పటికీ టాలీవుడ్ లో ఆమె గురించి చర్చలు జరుగుతూ ఉంటాయి. త్వరలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ గా చేయబోతున్నట్లు రూమర్స్ వస్తున్న నేపథ్యంలో.. 'ఆయనొక లెజెండ్. అలాంటి నటుడితో కలిసి నటిచడం ఒక డ్రీమ్' అని అమ్మడు చెప్పడంతో.. గత కొన్ని రోజులుగా ఫిల్మీ దునియాలో జాన్వీకి సంబంధించిన వార్తలే చక్కర్లు కొడుతున్నాయి.

అయితే ఇప్పుడు తాజాగా జాన్వీ కపూర్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ బ్యూటీ సింగిల్ కాదని.. ఆల్రెడీ ఒకరితో రిలేషన్ లో ఉందని రూమర్స్ వస్తున్నాయి. తాను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని.. ప్రస్తుతం సింగిల్ గానే ఉన్నానని జాన్వీ పలుమార్లు స్పష్టం చేసింది. అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం యువ వ్యాపారవేత్త ఓర్హాన్ తో డేటింగ్ చేస్తోందని బీటౌన్ సర్కిల్స్ లో రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి.

విలాసవంతమైన జీవనశైలి, ఖరీదైన కార్లు మరియు విదేశీ పర్యటనల గురించి క్రమం తప్పకుండా పోస్ట్ చేయడం వల్ల ఓర్హాన్ అవత్రమణి సోషల్ మీడియాలో ప్రసిద్ధి చెందాడు. అలానే తరచుగా జాన్వీ కపూర్ మరియు మరో హీరోయిన్ అనన్య పాండేలతో సహా తన స్నేహితులతో కలిసి ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంటాడు. ఇక జాన్వీ వరుణ్ ధావన్‌ తో కలిసి నటిస్తున్న 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' అనే సినిమా షూటింగ్ ఇటీవల యూరప్‌ లో జరుగుతుండగా.. ఓర్హాన్ అక్కడ కూడా ప్రత్యక్షమయ్యాడు.

ఈ నేపథ్యంలోనే జాన్వీ ప్రస్తుత బాయ్ ఫ్రెండ్ ఓర్హాన్ అవత్రమణి అని పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే ఇటీవల 'మిలీ' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. అతను ఎప్పటికీ తన బెస్ట్ ఫ్రెండ్ మాత్రమేనని.. అంతకు మించి ఏమీ లేదని పేర్కొంది. అయినప్పటికీ ఈ రూమర్స్ కు బ్రేక్ పడటం లేదు. వారి మధ్య ఏమీ లేకుండా ఇలాంటి వార్తలు వారు కదా అంటున్నారు.

నిజానికి వీర్ పహారియా - శిఖర్ పహారియా అనే ఇద్దరు అన్నదమ్ములతో గతంలో జాన్వీ కపూర్ మరియు ఆమె బెస్ట్ ఫ్రెండ్ సారా అలీఖాన్ డేటింగ్ చేశారు. ముంబై వీధుల్లో ఈ జంటలు కలిసి తిరిగిన ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వీర్ తో బ్రేకప్ అయ్యిందని గతంలో సారా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అలానే శిఖర్ తో జాన్వీకి బ్రేకప్ అయిందని వార్తలు వచ్చాయి. త్వరలోనే జాన్వీ  రిలేషన్ షిప్ స్టేటస్ పై క్లారిటీ వస్తుందేమో చూడాలి.

ఇకపోతే 'దఢక్' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి కష్టపడుతోంది. లేటెస్టుగా మత్తుకుట్టి జేవియర్ దర్శకత్వంలో ఆమె నటించిన 'మిలీ' సినిమా విడుదలైంది. ఇందులో జాన్వీ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి.

ఇది ఆమె తండ్రి బోనీ కపూర్ నిర్మాణంలో చేసిన ఫస్ట్ మూవీ. ప్రసుతం ఈ బ్యూటీ 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' సినిమాతో పాటుగా 'బవాల్' అనే మరో హిందీ సినిమా చేస్తోంది. ఇక కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న NTR30 లో హీరోయిన్ గా ఎంపికైందని టాక్.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • Bollywood 
  • beauty 
  • JanhviKapoor 
  • Boyfriend 
  • Orhan 
  • latestnews 

Similar News

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS