'క్రాక్' నిర్మాత పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడా?
పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం వరుసగా సినిమాలు రూపొందుతున్నాయి. గతంలో మాదిరిగా పవన్ ఒక్కో సినిమాకు ఏళ్లకు ఏళ్ల సమయం తీసుకోవడం లేదు. ఒక్కో సినిమాను మూడు నాలుగు నెలలు అంతకు తక్కువ సమయంలోనే ముగించేస్తున్నాడు. ఇటీవలే వకీల్ సాబ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత రానాతో కలిసి నటిస్తున్న మలయాళ మూవీ రీమేక్ తో రాబోతున్నాడు. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న హరి హర వీరమల్లు సినిమా తో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ రెండు సినిమాలు కాకుండా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా కు ఓకే చెప్పాడు.
ఆ సినిమా షూటింగ్ కూడా కాస్త అటు ఇటుగా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంతటి బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ మరి కొన్ని కథలకు కొందరు దర్శకులకు కూడా ఓకే చెప్పాడనే వార్తలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున అంచనాల నడుమ పవన్ సినిమా లు రూపొందబోతున్నాయి. పవన్ కళ్యాణ్ మరియు పూరిల కాంబో సినిమా కోసం అభిమానులు సుదీర్ఘ కాలంగా వెయిట్ చేస్తున్నారు. వీరి కాంబోలో రెండు సినిమా లు వచ్చాయి. ఆ రెండు సినిమాలు కూడా మంచి టాక్ ను దక్కించుకున్నాయి. ఇక వీరి కాంబోలో మూడవ సినిమా కోసం పలువురు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా వీరి కాంబో లో బండ్ల గణేష్ ఒక సినిమా ను చేయబోతున్నట్లుగా ఆ మద్య వార్తలు వచ్చాయి. కాని అవి పుకార్లే అంటే స్వయంగా బండ్ల క్లారిటీ ఇచ్చాడు.
ఇక వీరిద్దరి కాంబో మూవీ మళ్లీ ప్రచారంలో నిలిచింది. ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు కు కొన్నాళ్ల క్రితం పవన్ డేట్లు ఇచ్చాడట. ఇప్పుడు ఆ సినిమాను చేసేందుకు ఓకే చెప్పాడని తెలుస్తోంది. ఠాగూర్ మధు ఇటీవల సన్నిహితుల వద్ద మాట్లాడుతూ పవన్ మూవీ గురించి ప్రస్తావించాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఠాగూర్ మధు నిర్మించబోతున్న సినిమాకు పూరి దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు. ఇప్పటికే పవన్ మరియు పూరిల మద్య కథా చర్చలు మొదటి దశ జరిగినట్లుగా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో పక్కా కమర్షియల్ సబ్జెక్ట్ తో ఒక సినిమాను తెరకెక్కించేందుకు గాను పూరి రెడీ అవుతున్నట్లుగా చెబుతున్నారు.
ప్రస్తుతం పూరి లైగర్ సినిమాను చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న లైగర్ సినిమా లో హీరోయిన్ గా అనన్య పాండే నటిస్తున్న విషయం తెల్సిందే. పాన్ ఇండియా సినిమా గా లైగర్ ను తెరకెక్కిస్తున్న పూరి త్వరలోనే పవన్ తో సినిమా ను మొదలు పెడతాడని అభిమానులు ఆశ పడుతున్నారు. ఈ విషయమై ఠాగూర్ మధు స్పష్టత ఇవ్వాలని కొందరు అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఆయన ఎప్పటికి స్పష్టత ఇస్తాడో చూడాలి. పవన్ మరియు పూరి ల సినిమా అంటే ఖచ్చితంగా మరో రేంజ్ లో ఉంటుంది.. ఉండాలని అభిమానులు మొదటి నుండే అంచనాలు పెంచుకుంటూ ఉంటారు.
ఆ అంచనాలను అందుకోవాలంటే పూరి చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది. మరి ఆ రేంజ్ లో పూరి స్క్రిప్ట్ ను రెడీ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం లో సఫలం అవుతాడా అనేది చూడాలి. అయితే పవన్ ఇప్పటికే పలు సినిమా లు కమిట్ అయ్యాడు. కనుక పూరితో సినిమా అంటే 2023 వరకు సమయం పట్టే అవకాశాలు కూడా లేక పోలేదు అంటున్నారు. అప్పటి వరకు పూరి వెయిట్ చేస్తాడా లేదంటే ఇతర హీరోలతో సినిమాలు కానిస్తాడా అనేది చూడా తెలియాల్సి ఉంది.