హాట్‌ టాపిక్‌.. స్టార్‌ నటుడి ఆస్తుల అమ్మకాలు

సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు ఒకప్పుడు ఎంత పారితోషికం తీసుకున్న కొన్నాళ్ల తర్వాత సినిమాలు తగ్గితే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది.;

Update: 2026-01-19 16:30 GMT

సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు ఒకప్పుడు ఎంత పారితోషికం తీసుకున్న కొన్నాళ్ల తర్వాత సినిమాలు తగ్గితే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. అందుకు కారణం వారు కెరీర్‌లో పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో వచ్చిన డబ్బును పొదుపు చేయక పోవడం అంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనూ చాలా మంది నటీనటులు ఒకానొక సమయంలో భారీగా పారితోషికం తీసుకుని, తమ చరమాంకంలో మాత్రం తీవ్రమైన ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా వ్యవహరించిన వారు చాలా మంది ఇండస్ట్రీలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో మనం చూశాం. అందుకే ఇప్పుడు ఉన్న వారిలో ఎక్కువ శాతం కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ, ముందుగానే సేవింగ్స్ పై దృష్టి పెడుతున్నారు. అయితే ఒకప్పుడు భూమిపై పెట్టుబడి పెట్టి, అప్పట్లో వేల రూపాయలు, లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన భూములు ఇప్పుడు కోట్ల రూపాయల విలువ చేస్తున్నాయి.

హైదరాబాద్‌ లో భారీ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం

తెలుగు నటుడు మురళి మోహన్ గురించి ఈ విషయంలో ప్రముఖంగా చెప్పుకుంటూ ఉంటారు. ఆయన హైదరాబాద్‌ లో తక్కువ రేటు ఉన్న సమయంలో పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు వాటి విలువ కోట్ల రూపాయలు అనే విషయం తెల్సిందే. ఇక బాలీవుడ్‌ కి చెందిన కపూర్ ఫ్యామిలీ సైతం అప్పట్లో ముంబైలో భూములు కొనుగోలు చేయడం ద్వారా ఇప్పుడు వందల కోట్ల లాభాలను దక్కించుకుంటూ ఉండటం మనం చూడవచ్చు. తాజాగా ముంబై లోని అత్యంత ఖరీదైన ఏరియా అయిన జుహు ప్రాంతంలో జితేంద్ర, ఆయన కుమారుడు తుషార్‌ కపూర్‌ కి ఉన్న స్థలాలను విక్రయించడం జరిగింది. ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఈ మొత్తం స్థలంను కొనుగోలు చేసిందని ముంబై వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ డీల్ విలువ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.559 కోట్లుగా బాలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ముంబైలోని ఖరీదైన స్థలం అమ్మకం

ఈ ఒక్క డీల్‌ మాత్రమే కాకుండా ఇటీవల ఈ కపూర్ ఫ్యామిలీ ముంబైలో తమకు ఉన్న ఖరీదైన స్థలాలను ఒకొక్కటిగా అమ్మకంకు పెట్టినట్లు తెలుస్తోంది. గత ఆరు నెలల కాలంలో ఈ ఫ్యామిలీకి చెందిన స్థలాలను విక్రయించగా రూ.1415 కోట్లు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారీ మొత్తంలో రేట్లు పెరిగాయి, మరింతగా రేట్లు పెరిగే పరిస్థితి లేదు. అందుకే ఖరీదైన ఏరియాల్లో ఉన్న స్థలాలను ఈ ఫ్యామిలీ పూర్తిగా అమ్మడం ద్వారా భారీ మొత్తంలో ఆదాయాన్ని దక్కించుకుంది. ఈ మొత్తంను తమకు ఉన్న నిర్మాణ సంస్థతో పాటు ఇతర వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టే అవకాశాలు ఉన్నాయి అంటూ బాలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. జితేంద్ర కుటుంబం కేవలం కొన్ని నెలల్లో దాదాపు రూ.1500 కోట్ల విలువైన స్థలాలను అమ్మడం ద్వారా ముంబై వర్గాల్లోనే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.

కపూర్ ఫ్యామిలీకి భారీ ఆదాయం

ఒకప్పుడు తక్కువ మొత్తానికి కొనుగోలు చేయడం ద్వారా ఇప్పుడు భారీ మొత్తాన్ని ఈ ఫ్యామిలీ దక్కించుకుంది. అయితే ఈ ఫ్యామిలీకి ఇంకా పలు చోట్ల స్థలాలు, పొలాలు ఉన్నాయని బాలీవుడ్‌ వర్గాల వారు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఆయా స్థలాలకు పెద్దగా రేట్లు లేని కారణంగా వాటిని అమ్మకుండా ఉంచారని, వాటికి భారీగా రేటు వచ్చిన సమయంలో వాటిని కూడా అమ్మే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఆశాజనకంగా లేదు అనుకుంటున్న సమయంలో కపూర్ ఫ్యామిలీ ఈ స్థాయిలో డీల్స్ చేయడం ఆశ్చర్యంగా ఉందని ముంబై వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. ముంబైలో పెరిగిన భారీ జనాభాతో పాటు, అక్కడ సెలబ్రిటీలు ప్రతి ఒక్కరూ ఇంటిని కొనుగోలు చేయాలి అనుకోవడం వల్లే ఇలాంటి ఖరీదైన ఏరియాల్లో స్థలాలకు డిమాండ్ పెరిగింది. అందుకే ఈ కపూర్ ఫ్యామిలీకి వందల కోట్ల ఆదాయం సమకూరిందని అనేది ఒక వర్గం టాక్‌.

Tags:    

Similar News