న‌వీన్ ను చూసి అంద‌రూ ఏపీకి దారి తీస్తారా?

అందులో భాగంగానే టాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు షూటింగుల కోసం ఏపీకి రావాల‌ని కూడా ఏపీ డిప్యూటీ సీఎం, సినిమాటోగ్ర‌ఫీ మినిస్ట‌ర్ కందుల దుర్గేష్ బ‌హిరంగంగా అంద‌రినీ ఆహ్వానించారు.;

Update: 2026-01-19 22:30 GMT

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత సినీ ప‌రిశ్ర‌మ‌కు మ‌ద్ద‌తు బాగా వ‌స్తుంది. స్వ‌యంగా టాలీవుడ్ స్టార్ హీరోనే డిప్యూటీ సీఎం అవ‌డంతో, చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటూ వారికి కావాల్సిన‌వి స‌మ‌కూరుస్తున్నారు. టికెట్ రేట్స్ కు ప‌ర్మిష‌న్స్ విష‌యంలో కూడా ఇబ్బంది క‌ల‌గ‌కుండా అటు నిర్మాత‌ల‌కు, ఇటు ఆడియ‌న్స్ కు అనుకూలంగా నిర్ణ‌యాలు తీసుకుంటుంది.

ఏపీ షూటింగులు చేయాల‌ని పిలుపు

అందులో భాగంగానే టాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు షూటింగుల కోసం ఏపీకి రావాల‌ని కూడా ఏపీ డిప్యూటీ సీఎం, సినిమాటోగ్ర‌ఫీ మినిస్ట‌ర్ కందుల దుర్గేష్ బ‌హిరంగంగా అంద‌రినీ ఆహ్వానించారు. అయితే ఈ విష‌యాన్ని టాలీవుడ్ లోని అంద‌రూ ఏపీ ప్ర‌భుత్వం ఏదో చెప్పాల‌ని అలా చెప్పారులే అని లైట్ తీసుకున్నారు కానీ టాలీవుడ్ యంగ్ హీరో న‌వీన్ పోలిశెట్టి మాత్రం ఆ విష‌యాన్ని సీరియ‌స్ గా తీసుకున్నారు.

అన‌గ‌న‌గా ఒక రాజు షూటింగ్ కోసం ఏపీ వెళ్లిన న‌వీన్ పోలిశెట్టి

అందులో భాగంగానే న‌వీన్ పోలిశెట్టి అన‌గ‌న‌గా ఒక రాజు సినిమా కోసం అంద‌రిలా స్టూడియోల్లో, స్పెష‌ల్ సెట్స్ లో షూటింగ్ ను చేయ‌కుండా, క‌థ‌కు అవ‌స‌ర‌మయ్యే లొకేష‌న్ల‌కు వెళ్లాల‌ని డిసైడై, ఆంధ్ర‌ప్రదేశ్ లోని గోదావ‌రి ఏరియాలోకి వెళ్లి, అక్క‌డ సినిమాను తెర‌కెక్కించారు. అన‌గ‌న‌గా ఒక రాజు సినిమాను రియ‌ల్ లొకేష‌న్ల‌లో తీయ‌డం ద్వారా ఎక్క‌డా నేచురాలిటీ మిస్ అవ‌క‌పోవ‌గా, సినిమాకు వాస్త‌విక‌త‌ను జోడించాయి.

అన‌గ‌న‌గా ఒక రాజు సినిమాను గోదావ‌రి జిల్లాల్లో తెర‌కెక్కించ‌డం సినిమాకు బాగా ఉప‌యోగప‌డింది. అంతేకాదు, ఈ మూవీకి ఏపీ ప్ర‌భుత్వం నుంచి మ‌ద్దతు కూడా బాగా ల‌భించింది. షూటింగ్ కు, రిలీజ్ కు ప‌ర్మిష‌న్స్ లేట‌వ‌కుండా రావ‌డ‌మే కాకుండా, అధికారుల నుంచి, స్థానిక ప్ర‌జ‌ల నుంచి కూడా చిత్ర యూనిట్ కు మంచి స‌హ‌కారం అందింది. దీని వ‌ల్ల షూటింగ్ ప్రాసెస్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జ‌ర‌గ‌డ‌మే కాకుండా బ‌డ్జెట్ ను కంట్రోల్ చేయ‌డంలో కూడా ఉప‌యోగ‌ప‌డిందని తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమాను చూసి మ‌రిన్ని సినిమాలు ఏపీలో షూటింగ్ జ‌రుపుకోవ‌డానికి రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News