హ్యారీ పాటర్ థీమే కొంపముంచిందా?
ఏం చెబుతున్నారో వారికే అర్థం కానీ కథ, కథనాలని ఎంచుకుని కొంత మంది డైరెక్టర్లు చేస్తున్న వింత సినిమాలు ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్లు అవుతున్నాయి.;
కొంత మంది డైరెక్టర్లు తీసే సినిమాలు చేస్తుంటే కింగ్ సినిమాలో బ్రహ్మానందం డైలాగ్ `ఎంచుకున్న తాళమేంటీ..పాడుతున్న రాగమేంటీ..` గుర్తొస్తుంది. కథొకటి కథనం మరొకటి..హీరో ఒకరైతే అతనికి ఏమాత్రం సూటవ్వని కథలని ఎంచుకుని కంగాళీ చేసేస్తుంటారు. దీంతో అనుకున్నది ఒకటి అయ్యింది మరొకటి అన్నట్టుగా మారుతుంటుంది ఆ సినిమాల పరిస్థితి. ఏం చెబుతున్నారో వారికే అర్థం కానీ కథ, కథనాలని ఎంచుకుని కొంత మంది డైరెక్టర్లు చేస్తున్న వింత సినిమాలు ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్లు అవుతున్నాయి.
మేకర్స్‌కి, హీరోలకి, ఫ్యాన్స్‌కి కోలుకోలేని షాక్ ఇస్తున్నాయి. ఆదిపురుష్, గేమ్ ఛేంజర్ లాంటి సినిమాలు ఇదే కోవకు చెందుతాయి. ఇప్పుడు ఇదే కోవలోకి రీసెంట్‌గా విడుదలైన ఓ పాన్ ఇండియా స్టార్ మూవీ చేరింది. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న హీరో ఆల్ ఆఫ్ సడన్‌గా హారర్ కామెడీ థ్రిల్లర్‌తో ప్రేక్షకులని అలరించాలని ప్లాన్ చేసుకున్నాడు. దీంతో ప్రచార చిత్రాలతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. కథ, కథనాలు కూడా కొత్తగా ఉంటాయని అంతా భావించారు. కానీ థియేటర్లోకి వెళితే కళ్లు బైర్లు కమ్మి సగటు అభిమానికి బొమ్మ కనిపించిందనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.
రీసెంట్‌గా విడుదలైన సినిమాల్లో విజేతగా నిలుస్తుందని అంతా భావిస్తే తీవ్ర నిరాశకు గురి చేసింది. పది రోజులకు ప్రపంచ వ్యాప్తంగా రూ.180 కోట్లు రాబట్టింది.. అంటే సినిమా ఫలితం ఏంటన్నది దీన్ని బట్టే అర్థమవుతోందనే కాముంట్‌లు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఓ మాయా మహల్..అందులో ఓ ఘోస్ట్.. అందులోకి ఎంట్రీ ఇచ్చిన హీరో ఎలా దాని నుంచి బయటపడ్డాడు అన్నదే కథ. ఆ ఘోస్ట్ తాత అయితే..తన వారసుడిగా మనవడిని అంగీకరించకపోగా తనని ఇబ్బందులకు గురి చేస్తే ఏంటన్నదే ప్రధాన కథ.
అయితే ఇది రెగ్యులర్ ఘోస్ట్ మూవీ కాదు. హారర్ థ్రిల్లర్ అంతకన్నా కాదు. ఓ ఘోస్ట్ మైండ్ గేమ్‌తో తన మహల్‌లోకి వచ్చిన మనవడిని ఆటపట్టిస్తూ భయపెట్టే కథ. దెయ్యం ఏంటీ మైండ్ గేమ్ ఆడటం ఏంటీ? అన్నది ఇప్పుడు ఎవరికీ ఎక్కడం లేదు. ఇదే పాయింట్‌ని ప్రధానంగా తీసుకుని `హారీ పాటర్` సిరీస్‌ని రూపొందించారు. చీకటి లోకపు రారాజు `వోల్డ్ మోర్ట్` తన మైండ్ గేమ్‌తో హారీని ఎలా తన ఆధీనంలోకి తీసుకోవాలనుకున్నాడు? అతన్ని ఎలా అంతం చేయాలనుకున్నాడు? దాన్ని ప్రతిఘటించిన హారీ మాంత్రికుడు వోల్డ్ మోర్ట్ ని ఎలా అంతం చేశాడు అన్నదే `హారీ పాటర్` సిరీస్ అసలు కథ.
సరిగ్గా ఇదే ఫార్ములాని పాన్ ఇండియా స్టార్ సినిమాకు అప్లై చేసినట్టుగా కనిపిస్తోంది. దాన్ని ప్రేక్షకులకు తెలియజేయడం కోసమే డా.పద్మభూషణ్ అంటూ మరో క్యారెక్టర్‌ని రంగంలోకి దించినా ఫలితం లేకుండా పోయింది. గ్రాఫిక్స్ కూడా వర్కవుట్ కాకపోవడంతో అనుకున్నది ఒకటి అయ్యింది మరొకటి అన్నట్టుగా తయారైంది పాన్ ఇండియా స్టార్ కామెడీ హారర్ థ్రిల్లర్ పరిస్థితి. హ్యారీ పాటర్ థీమే కొంపముంచిందా? అంటే సినిమాని బట్టి చూస్తే అది హండ్రెడ్ పర్సెంట్ నిజం అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.