అఖిల్ మ‌రోసారి వెన‌క్కి త‌గ్గుతున్నాడా?

Update: 2022-07-06 11:28 GMT
అఖిల్ అక్కినేని మొత్తానికి నాలుగ‌వ సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచిల‌ర్‌'తో స‌క్సెస్ బాట ప‌ట్టాడు. ఈ మూవీ త‌రువాత అఖిల్ భారీ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రావాల‌ని 'ఏజెంట్‌'మూవీ చేస్తున్న విష‌యం తెలిసిందే. స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ తో ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న సుక‌రేంద‌ర్ రెడ్డి ఈ మూవీని రూపొందిస్తున్నారు. 'సైరా' డిజ‌ప్పాయింట్ చేయ‌డంతో 'ఏజెంట్‌'తో ఎలాగైనా బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాలనే క‌సితో ఈ మూవీ చేస్తున్నాడు.

అందుకే ఏకే ఎంట‌ర్ టైన్ మెంట్ తో క‌లిసి సురేంద‌ర్ రెడ్డి నిర్మాణ భాగ‌స్వామిగా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నఈ మూవీ షూటింగ్ ద‌శ‌లో వుంది. అఖిల్ కెరీర్ లోనే అత్యంత భారీ బ‌డ్జెట్ తో, భారీ కాస్టింగ్ తో రూపొందుతున్న సినిమా ఇది. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న ఈ మూవీ లో సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టిస్తోంది. 'మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచిల‌ర్‌' త‌రువాత భారీ హిట్ ని త‌న ఖాతాలో వేసుకుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న అఖిల్ ఈ మూవీపై భారీగానే అంచ‌నాలు పెట్టుకున్నాడు.

ఈ మూవీ కోసం భారీగా శ్ర‌మించి సిక్స్ ప్యాక్ బాడీ షేప్ లోకి వ‌చ్చేశాడు. ఇందు కోసం భారీగానే క‌స‌ర‌త్తులు చేశాడు. భారీ అంచ‌నాల మ‌ధ్య అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కుతున్న ఈ మూవీని చిత్ర బృందం ఆగ‌స్టు 12న విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేసింది. అయితే తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ మూవీ రిలీజ్ మ‌ళ్లీ మారిన‌ట్టుగా తెలుస్తోంది. ముందు ఈ మూవీని గ‌త ఏడాది డిసెంబ‌ర్ లోనే రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. కానీ కుద‌ర‌లేదు. ఆ త‌రువాత ఆగ‌స్టు 12కు మార్చారు.

తాజాగా ఈ డేట్ కూడా మ‌ళ్లీ మారిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ సంద‌ర్భంగా చాలా సార్లు అఖిల్ కు గాయాల‌య్యాయి. వాటి కార‌ణంగా కొంత వ‌ర‌కు చేయాల్సి షూటింగ్ ని వాయిదా వేస్తూ వ‌చ్చారు.

దాంతో షూటింగ్ పూర్తి చేయ‌డానికి మ‌రింత స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం వుంద‌ని, అంతే కాకుండా స్క్రిప్ట్ లో చేసిన మార్పులు కూడా ఓ కార‌ణంగా మారాయ‌ని తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతున్న సినిమా కావ‌బ‌ట్టి హ‌రీ బ‌రీగా రిలీజ్ చేయ‌డం ఎందుకని చిత్ర బృందం మ‌రో డేట్ ని ఫిక్స్ చేయాల‌ని ముందు అనుకున్న డేట్ ని మార్చాల‌నుకుంటొంద‌ట‌. దీనికి సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ ని మేక‌ర్స్ త్వ‌ర‌లోనే చేయ‌నున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.
4

ఇదిలా వుంటే టీజ‌ర్ ని త్వ‌ర‌లో టీజ‌ర్ ని విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది. టీజ‌ర్ ఫైన‌ల్ క‌ట్ పూర్త‌యింద‌ని, 1 నిమిషం 15 సెక‌న్ల నిడివితో టీజ‌ర్ ని రిలీజ్ సిద్ధం చేసిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. స్టైలిష్ యాక్ష‌న్ బ్లాక్స్ తో పాటు రెండు ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్స్ వుండేలా టీజ‌ర్ ని క‌ట్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది. ఇంట‌ర్నేష‌న‌ల్ స్టాండ‌ర్డ్స్ తో తెర‌కెక్కించిన ఈ మూవీకి మేక‌ర్స్ దాదాపు 70 కోట్ల వ‌ర‌కు ఖర్చు చేసిన‌ట్టుగా చెబుతున్నారు.
Tags:    

Similar News