తెలుగు బిగ్‌ బాస్ ఓటీటీ ఓ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

Update: 2022-01-09 06:30 GMT
ప్రపంచ వ్యాప్తంగా సూపర్‌ హిట్ అయిన బిగ్‌ బాస్ ఇండియాలో దశాబ్దన్నర కాలంగా ఎంటర్‌ టైన్ చేస్తుంది. అయిదేళ్ల క్రితం వరకు హిందీలో మాత్రమే బిగ్‌ బాస్ ఉండేది. ఇప్పుడు సౌత్‌ లో అన్ని భాషల్లో కూడా బిగ్‌ బాస్ ఎంటర్‌ టైన్ మెంట్‌ కనిపిస్తుంది. తెలుగు లో మొదటి సీజన్ కు ఎన్టీఆర్‌ హోస్ట్‌ గా వ్యవహరించగా తదుపరి సీజన్ కు నాని హోస్టింగ్‌ చేశాడు. ఆ తర్వాత నుండి వరుసగా నాగార్జున హోస్ట్‌ గా చేస్తున్నాడు. తెలుగు బిగ్‌ బాస్ మంచి విజయం సాధించింది.

సీజన్ 5 గ్రాండ్ ఫినాలేకు వచ్చిన రేటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కోట్లాది మంది బిగ్ బాస్ సీజన్‌ 5 గ్రాండ్ ఫినాలే చూశారు. వీక్‌ డేస్ లో కాస్త వీక్‌ రేటింగ్‌ వచ్చినా వీకెండ్స్ స్పెషల్‌ ఎపిసోడ్స్ కు మంచి రేటింగ్ వచ్చింది. అందుకే బిగ్‌ బాస్ తదుపరి సీజన్ లకు సంబంధించి కూడా అప్పుడే చర్చలు సంప్రదింపులు ప్రారంభం అయ్యాయి. ఈ సమయంలో బిగ్‌ బాస్ ఓటీటీ తెలుగు గురించి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

హిందీ లో సల్మాన్‌ హోస్ట్‌ గా టీవీలో బిగ్ బాస్ షో టెలికాస్ట్‌ అయ్యింది. అయితే కరణ్‌ జోహార్‌ హోస్ట్‌ గా ఓ ఓటీటీ బిగ్‌ బాస్ షో సాగింది. దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు లో కూడా ఓటీటీ కి మంచి రెస్పాన్స్ ఉన్న కారణంగా డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ వారు మరియు బిగ్‌ బాస్ నిర్వాహకులు ఓటీటీ లో ప్లాన్‌ చేస్తున్నారు. బిగ్‌ బాస్ గ్రాండ్ ఫినాలే రోజే నాగార్జున ఫిబ్రవరిలో మళ్లీ కలుద్దాం.. కొత్తగా కలుద్దాం అంటూ ప్రకటించాడు. వెంటనే కొత్త సీజన్ కు సంబంధించిన అధికారిక ప్రకటన ఓటీటీ ద్వారా అంటూ క్లారిటీ ఇచ్చారు. ఓటీటీ బిగ్ బాస్ కు కూడా నాగార్జున హోస్టింగ్‌ అంటూ అధికారికంగా తెలియజేశారు.

ఇప్పుడు కంటెస్టెంట్స్ కు సంబంధించిన ఎంపిక పక్రియ ప్రారంభం అయ్యింది. ఇప్పటికే కొందరి పేర్లు ఫైనల్‌ చేయగా మరి కొందరి పేర్లను పరిశీలిస్తున్నారు. ఓటీటీ లో బిగ్‌ బాస్ అయినా కూడా ఏమాత్రం తగ్గేది లేదు అన్నట్లుగా కంటెస్టెంట్స్ విషయంలో అత్యధిక జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నారు. అందుకే విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు సెలబ్రెటీలను ఈ షో కోసం ఎంపిక చేస్తున్నారు. ఈ సమయంలో తెలుగు బిగ్‌ బాస్ ఓటీటీ మొదటి సీజన్ కు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఎన్టీఆర్ తో బిగ్‌ బాస్ అనుకున్న సమయంలో తెలుగు ప్రేక్షకుల నుండి ఎలాంటి స్పందన వస్తుందో అనే అనుమానాలు ఉండేవి. అందుకే షో ను వంద రోజులు కాకుండా 10 వారాలే కొనసాగించాలని నిర్ణయించారు. అనుకున్నట్లుగానే ఎన్టీఆర్‌ బిగ్‌ బాస్ షో ను షార్ట్‌ అండ్‌ స్వీట్ గా ముగించారు. ఇప్పుడు బిగ్‌ బాస్ ఓటీటీ కి కూడా అదే ఫార్ములాను ఫాలో అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. షో కు వచ్చే టాక్‌ ను బట్టి ముందు ముందు సీజన్ ల్లో వారాలు పెంచుకోవచ్చు. కాని మొదటి ఓటీటీ సీజన్ ను మాత్రం 10 వారాల్లోనే ముగించాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఒక వేళ షోకు అనూహ్యంగా మంచి రెస్పాన్స్ వస్తే వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలను పంపించి షో ను మరో మూడు నాలుగు వారాలు పెంచినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. షో ఎలా ఉన్నా కూడా బిగ్‌ బాస్ ప్రేక్షకులు ఖచ్చితంగా ఆధరిస్తారు అనేది కొందరి అభిప్రాయం.

తెలుగు ప్రేక్షకులు బిగ్‌ బాస్ కు అడిక్ట్‌ అయ్యారు. కనుక ఓటీటీ లో వచ్చినా మరెక్కడ వచ్చినా కూడా ఆధరించకుండా ఉండలేరు అనేది విశ్లేషకుల వాదన. మరి నాగార్జున బిగ్‌ బాస్ ఓటీటీ తో ఎలా ఆకట్టుకుంటాడు.. అసలు ఈ షో ఫార్మట్‌ ఎలా ఉంటుంది అనేది చూడాలి. 24 గంటల పాటు ఓటీటీ లో హౌస్ లో ఉన్న వారిని చూపించబోతున్నట్లుగా చెబుతున్నారు. అలా చూపిస్తే చూస్తారా.. అయినా అలా చూపించడం సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలుగు ప్రేక్షకుల్లో బిగ్‌ బాస్ ఓటీటీ గురించి అనేక అనుమానాలు ఉన్నాయి. వాటన్నింటికి సమాధానం రావాలంటే ఫిబ్రవరిలో షో ప్రారంభం అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.
Tags:    

Similar News