• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  RRR నుంచి ఆసక్తికరమైన...

RRR నుంచి ఆసక్తికరమైన అప్డేట్..!

By - Tupaki Desk
Update: 2021-10-30 08:05 GMT
మోస్ట్ అవైటెడ్ మల్టీస్టారర్ ''ఆర్.ఆర్.ఆర్'' సంక్రాంతి కానుకగా జనవరి 7న  ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నారు.

'ఆర్.ఆర్.ఆర్' సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టిన జక్కన్న అండ్ టీమ్.. ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌ ను అందించింది. RRR నుంచి 45 సెకండ్ల గ్లిమ్స్ ని రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. నవంబర్ 1వ తేదీన ఉదయం 11 గంటలకు ఈ స్మాల్ వీడియోని సినీ అభిమానులతో పంచుకోనున్నారు. 

ఈ సందర్భంగా ఎన్టీఆర్ - రామ్ చరణ్ లకు సంబంధించిన ఓ పోస్టర్ ని విడుదల చేసారు. ఇందులో ఇద్దరూ వేర్వేరు దిక్కుల్లో ఇంటెన్స్ గా చూస్తున్నారు. RRR - PVR చేతులు కలుపుతున్న సందర్భంగా నిన్న శుక్రవారమే ఈ గ్లిమ్స్ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం చెందడంతో అప్డేట్ వాయిదా వేశారు. ఈ క్రమంలో నవంబర్ 1న విడుదల చేస్తునన్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ గ్లిమ్స్ ఎలా ఉండబోతోందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన RRR ప్రచార చిత్రాలు - టీజర్లు - ఫస్ట్ సింగిల్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ పాత్రల్లో చరణ్ - తారక్ ఆకట్టుకున్నారు. ఇందులో అలియా భట్‌ - ఒలివియా మోరిస్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అజయ్ దేవగన్ - శ్రియ శరణ్ - సముద్రఖని ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై దానయ్య ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Tags:    
  • RRR 
  • pre-release 
  • Rajamouli 
  • Ram Charan 
  • Jr NTR 
  • India 
  • biggest 
  • action 
  • drama 
  • update 
  • teaser 
  • pvrrr 
  • PuneethRajkumar 

Similar News

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

Copyright @2026

Powered by Blink CMS