వెండి తెర సావిత్రి ‘గుడ్‌ లక్‌ సఖి’

Update: 2020-05-11 07:45 GMT
నేను శైలజ చిత్రంతో ఒక్కసారిగా  టాలీవుడ్‌ లో క్రేజీ బ్యూటీగా మారిపోయిన కీర్తి సురేష్‌ మహానటి తర్వాత మరింత స్టార్‌ డంను దక్కించుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం హిందీ చిత్రాల్లో కూడా  వరుసగా నటిస్తోంది. తెలుగులో ఈమె నటించిన మిస్‌ ఇండియా విడుదలకు సిద్దం అయ్యింది. కరోనా లేకుంటే ఈ సమ్మర్‌ లో కీర్తి సురేష్‌ మిస్‌ ఇండియాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేది. లాక్‌ డౌన్‌ ఎత్తివేసి సినిమా విడుదలకు అనుమతించిన వెంటనే మిస్‌ ఇండియా విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఈమె మరో సినిమాను కూడా చేస్తోంది.

విలక్షణ స్క్రిప్ట్‌ రైటర్‌ దర్శకుడిగా పేరున్న నగేష్‌ కుకునూరు దర్శకత్వంలో ఈమె ఒక సినిమాను చేస్తోంది. ఆ సినిమాను మొదట నగేష్‌ స్వయంగా నిర్మించినా ఈమద్య ఆ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో దిల్‌ రాజు కూడా పార్ట్‌ అయ్యాడు. కథ నచ్చడంతో పాటు తీస్తున్న తీరు నచ్చడంతో దిల్‌ రాజు ప్రొడక్షన్‌ లో ఇన్వాల్‌ అయ్యాడని టాక్‌ వినిపిస్తుంది. ఈ సినిమాకు అంతకు ముందు వరకు నగేష్‌ ఒక టైటిల్‌ ను అనుకున్నాడట. కాని దిల్‌ రాజు దాన్ని మార్చేశాడు.

దిల్‌ రాజు చేతికి వచ్చిన తర్వాత ఆ సినిమాకు ‘గుడ్‌ లక్‌ సఖి’ అంటూ మార్పించాడు. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఈ సినిమా విడుదల కాబోతుంది. రెండు భాషలకు సూట్‌ అయ్యేలా ఈ టైటిల్‌ ను ఖరారు చేశారట. షూటింగ్‌ సగానికి పైగా పూర్తి చేసిన నగేష్‌ లాక్‌ డౌన్‌ ఎత్తి వేసిన వెంటనే షూటింగ్‌ మొదలు పెట్టి పూర్తి చేయాలని భావిస్తున్నాడు.

అంతా సాఫీగా ఉంటే ఈ ఏడాది చివర్లోనే ఈ సినిమా విడుదల కావచ్చు అంటున్నారు. దిల్‌ రాజు హ్యాండ్‌ పడటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో ఆసక్తి వ్యక్తం అవుతోంది. మరి కీర్తి సురేష్‌ గుడ్‌ లక్‌ సఖి చిత్రంతో మరో సక్సెస్‌ ను తన ఖాతాలో వేసుకుంటుందో చూడాలి.
Tags:    

Similar News