• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  థియేటర్లు ఈసారి ఓపెన్...

థియేటర్లు ఈసారి ఓపెన్ అయితే.. ఆ లెక్కనేనట

By - Tupaki Desk
Update: 2021-07-06 08:30 GMT
కరోనా జోరు తగ్గింది. కేసుల నమోదులోనూ మార్పులు వచ్చేశాయి. రెండు నెలల క్రితం మహమ్మారి దెబ్బకు  ఉక్కిరిబిక్కిరి అయిన రెండు తెలుగురాష్ట్రాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ప్రభుత్వాలు సైతం తాము విధించిన పరిమితుల్ని వెనక్కి తీసుకుంటున్నాయి. సాధారణ పరిస్థితుల్ని నెలకొనేలా చేస్తున్నాయి.అన్ని వర్గాల ప్రజలకు వినోదాన్ని అందించే సినిమా థియేటర్లను ఓపెన్ చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడో అనుమతులు ఇచ్చేసింది. అయినప్పటికీ థియేటర్లు ఓపెన్ కాలేదు.

ఎందుకిలా? అంటే.. ఏపీలో థియేటర్లు ఓపెన్ కాకుండా.. తెలంగాణలో మాత్రమే తెరిస్తే ప్రయోజనం ఏముంటుందన్నది ప్రశ్న. నిజమే.. తెలుగు సినిమాకు ఆయువుపట్టు ఆంధ్రానే. కలెక్షన్లలో సింహభాగం ఏపీ నుంచే వస్తాయి. అలాంటప్పుడు అంత పెద్ద ఆదాయవనరును ఏ వ్యాపారవేత్త కూడా వదులుకోడు కదా? అందులోకి పెద్ద హీరోల సినిమాలు అంటే.. అంచనాలు భారీగా ఉంటాయి.  తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా థియేటర్లను ఓపెన్ చేసుకోవటానికి అనుమతులు ఇచ్చింది. మరి.. థియేటర్లు ఎప్పటి నుంచి ఓపెన్ అవుతాయి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మరో రెండు వారాల్లో థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం ఉందని.. కాకుంటే ఆగస్టు రెండో వారం నుంచి కరోనా థర్డ్ వేవ్ మొదలువుతుందన్న అంచనా తెలుగు సినిమా పరిశ్రమను కలవరానికి గురి చేస్తున్నాయి. ఈ నెలలో థియేటర్లు ఓపెన్ చేసినా.. సరిగ్గా మరో నెల..నెలన్నరకు మూయాల్సి రావటం అంటే అదో తిప్పలు. అందుకే.. స్వల్ప వ్యవధిలో మళ్లీ పరిమితులు విధించే వీలుంటే.. థర్డ్ వేవ్ తర్వాతే థియేటర్లు ఓపెన్ అవుతాయని చెబుతున్నారు.

మొదటి వేవ్ తర్వాత రెండో వేవ్ కు మధ్యన థియేటర్లను ఓపెన్ చేయటం.. మొదట 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో కొంతకాలం థియేటర్లను నిర్వహించారు. తాజాగా అలా థియేటర్లు ఓపెన్ చేయటం అంటే.. సాధ్యం కాదన్నది సినీ పెద్దల మాటగా చెబుతున్నారు. 50 శాతం సీటింగ్ పరిమితి ఉంటే కలెక్షన్లు పెద్దగా ఉండవని.. అలాంటి వేళలో పెద్ద హీరోల సినిమాలు విడుదల కావని తేలుస్తున్నారు. పెద్ద హీరోల సినిమాలు విడుదల కాకుంటే.. పెద్ద మజా ఉండదు. ఇలాంటివెన్నో అంశాలు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్ అయ్యే విషయంలో కీలకమవుతాయని భావిస్తున్నారు. మరేం జరగుతుందో చూడాలి.
Tags:    
  • theatres 
  • telangana 
  • tollywood movies 
  • hyderabad 
  • andhra pradesh 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS