సుమంత్.. భలే టైటిల్ తో వచ్చాడే
చాలా కాలం తర్వాత గత ఏడాది ‘మళ్ళీ రావా’ సినిమాతో మంచి విజయాన్నందుకున్నాడు సుమంత్. ఆ చిత్రం భారీ వసూళ్లేమీ సాధించలేదు కానీ.. పెట్టుబడిని వెనక్కి తెచ్చింది. మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ మాత్రం విజయం కోసమే సుమంత్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సుమంత్ కెరీర్ ఊపందుకున్నట్లే ఉంది. ‘మళ్ళీరావా’ విడుదలైన వెంటనే ఓ సినిమా మొదలుపెట్టాడు సుమంత్. ఆ చిత్రం దాదాపుగా పూర్తి కావచ్చింది. ఈ రోజు ఆ చిత్ర టైటిల్ ప్రకటించారు. ‘ఇదం జగత్’ అనే వెరైటీ.. ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టారు ఈ చిత్రానికి. షూటింగ్ తుది దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఇంకో రెండు నెలల్లో ప్రేక్షకుల ముందుకు తేవాలని అనుకుంటున్నారు.
అనిల్ శ్రీకాంతం అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. జొన్నలగడ్డ పద్మావతి అనే కొత్త నిర్మాత ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది. డబ్బు చుట్టూ సాగే థ్రిల్లర్ మూవీ ఇదని అంటున్నారు. మరోవైపు సుమంత్ ఇటీవలే ‘సుబ్రమణ్యపురం’ అనే కొత్త సినిమాను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం కొంచెం భారీ బడ్జెట్ తోనే తెరకెక్కబోతోంది. అందులో ఈషా రెబ్బా కథానాయికగా నటిస్తోంది. సంతోష్ జాగర్లమూడి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. వరుసగా కొత్త దర్శకులతోనే సుమంత్ జట్టు కడుతుండటం విశేషం. తన సినిమాల్లో అతను పెట్టుబడులు కూడా పెడుతున్నట్లు ఇంసడ్ట్రీ జనాలు అంటున్నారు.