అన్నయ్య లక్షల మంది ఫ్యాన్స్ లో నేను మొదటి వాడిని

Update: 2021-08-22 13:30 GMT
మెగా స్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా కొన్ని లక్షల మంది సోషల్‌ మీడియా ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంతో మంది బర్త్‌ డే శుభాకాంఓలు చెప్పినా కూడా చిరంజీవికి పవన్ కళ్యాణ్‌ చెప్పిన బర్త్‌ డే శుభాకాంక్షలు ప్రతి సారి కూడా చాలా ప్రత్యేకంగా నిలుస్తాయి అనడంలో సందేహం లేదు. పవన్ కళ్యాణ్‌ ప్రెస్‌ నోట్‌ విడుదల చేయడంతో పాటు.. స్వయంగా చిరంజీవి ఇంటికి వెళ్లి మరీ శుభాకాంఓలు చెప్పడం జరిగింది. ప్రెస్ నోట్‌ లో తన అన్న యొక్క గొప్పతనం తన అన్నపై తనకు ఉన్న అనురాగం ప్రేమ అభిమానంను పవన్‌ కళ్యాణ్‌ చెప్పాడు.

అన్న చిరంజీవి గురించి పవన్‌ కళ్యాణ్‌... చిరంజీవి నాకే కాదు ఎందరికో మార్గదర్శి... చిరంజీవి నాకే కాదు ఎందరికో స్ఫూర్తి ప్రదాత... చిరంజీవి నాకే కాదు ఎందరికో ఆదర్శప్రాయుడు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆయన తమ్ముడిగా పుట్టడం అదృష్టం అయితే.. ఆయన సుగుణాలు చూస్తూ పెరగడం మరో అదృష్టం. అన్నయ్యను ఆరాధించే లక్షలాది మందిలో నేను తొలి అభిమానిని. ఆయన్ను చూస్తూ ఆయన సినిమాలను చూస్తూ.. ఆయన అభ్యన్నతిని కన్నులార చూశాను. ఒక అసామాన్యుడిగా ఎదిగిన సామాన్యుడు. ఎంత ఎడిగినా ఒదిగి ఉండాలి అనేది ఆయన లక్షణం. ఎన్నో అత్యున్నత శిఖరాలను అధిరోహించినా కూడా ఆయన ఇంకా వినమ్రతతో ఉంటారు. ఎంతో మంది ప్రాణాలు కాపాడిన గొప్ప వ్యక్తి ఆయన.

చిరంజీవి కుటుంబంలో పుట్టడం అదృష్టం. మా కుటుంబంలో అన్నగా పుట్టి తండ్రిలా మమ్ములను సాకారు. ఆ ప్రేమ మూర్తి పుట్టిన రోజుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అంటూ పేర్కొన్నారు. చిరంజీవి గురించి పవన్ కళ్యాణ్‌ చేసిన ఈ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది. పవన్‌ కళ్యాణ్ మరియు చిరంజీవి కలయిక కోసం అభిమానులు ఎప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. నేడు పవన్‌ కళ్యాణ్ నుండి చిరు బర్త్‌ డే శుభాకాంక్షలు అందడంతో అంతా కూడా ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు.
Tags:    

Similar News