నా సేవకే టైం లేదు.. ప్రజలకా నో: వర్మ సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ.. గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రెస్స్ అనిపించుకునే దర్శకుడు ఎల్లప్పుడూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. తాజాగా అలాంటి వ్యాఖ్యలతో రాంగోపాల్ వర్మ మరోసారి కాంట్రవర్సీకి తెరలేపాడు. కానీ ఈసారి వర్మ రాజకీయాల గురించి మాట్లాడటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో కరోనా మహమ్మారి పై అలాగే కరోనా వాక్సిన్ - నరేంద్రమోడీ లపై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉన్నాడు.
అయితే తాజాగా రాజకీయాలలో రాంగోపాల్ వర్మ చేరుతాడేమో అన్నట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ అలాంటి పుకార్లకు చెక్ పెట్టేసాడు వర్మ. దేశంలోని ప్రజలకు సేవ చేసే ఉద్దేశం తనకు లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పేసాడు. అందుకే రాజకీయాల్లో అరంగేట్రం గురించి ఆలోచించడం లేదని వర్మ తెలిపాడు. అలాగే నాకు నేను సేవ చేసుకోవడానికే టైమ్ సరిపోవడం లేదు. ఇంకా ప్రజలకేం సేవ చేస్తాను. ప్రజలకు సేవ చేసే ఉద్దేశం ఉన్నవాళ్లే రాజకీయాల్లోకి వస్తారు. చాలామంది నేతలు ఫేమ్, పవర్ కోసం మాత్రమే రాజకీయాల్లో అడుగుపెడతాడు. ఆ విషయాన్ని బయటకు చెప్పుకోలేక ప్రజాసేవ అని పలుకుతారని వర్మ స్టైల్లో ఆన్సర్ ఇచ్చాడు.
వీటితో పాటుగా వర్మ.. త్వరలో ప్రారంభించనున్న స్పార్క్ ఓటీటీ గురించి కూడా పలు విషయాలు బయటపెట్టాడు. వర్మ మాట్లాడుతూ.. 'రాబోయే రోజుల్లో ఓటీటీలే ప్రేక్షకులకు బాగా దగ్గరగా అందుబాటులో ఉంటాయి. నాకు తెలిసిన వ్యక్తితో కలిసి ఈ నెల 15న స్పార్క్ ఓటీటీని ప్రారంభిస్తున్నాను. ఇందులో అన్నిరకాల కథాచిత్రాలు అందుబాటులో ఉంటాయి. అయితే ప్రస్తుతం దావూద్ ఇబ్రహీం జీవితం ఆధారంగా రూపొందిన 'డీ కంపెనీ' సినిమా కూడా ఇందులోనే విడుదల చేస్తాం. దావుద్ జీవితాన్ని కొన్ని గంటల్లో చెప్పలేం. అందుకే వెబ్ సిరీస్ రూపంలో తీసుకొస్తున్నామని వర్మ చెప్పుకొచ్చాడు.