హాలీవుడ్ జంపైన న‌టి త్రివిక్ర‌మ్ తో?

Update: 2021-06-13 03:30 GMT
సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ `కాలా` చిత్రంలో న‌టించింది హ్యూమా ఖురేషి. అంత‌కుముందు బాలీవుడ్ లో ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన‌ ఈ బ్యూటీ టాలీవుడ్ లోనూ అడుగుపెట్ట‌నుంద‌ని చాలా కాలంగా క‌థ‌నాలొస్తున్నాయి. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ చిత్రంలో న‌టించేందుకు సంత‌కం చేయ‌నుంద‌ని ఇటీవ‌ల క‌థ‌నాలొచ్చాయి.

మ‌రోవైపు హ్యూమా హాలీవుడ్ లోనూ తొలి అడుగులు వేస్తోంది. ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌కుడు జాక్ స్నైడర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన నెట్ ఫ్లిక్స్ చిత్రంలో హ్యూమా న‌టించింది. అనురాగ్ కశ్యప్ తెర‌కెక్కించిన‌ గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ చిత్రంతో తొమ్మిదేళ్ల క్రితం హ్యూమా బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కొన్ని ఏళ్లుగా హాలీవుడ్ నుంచి ఆఫ‌ర్లు అందుకుంటున్నా వీలుప‌డ‌లేదు. ఎట్ట‌కేల‌కు జాక్ స్నైడర్ జోంబీ హీస్ట్ యాక్షన్-థ్రిల్లర్ `ఆర్మీ ఆఫ్ ది డెడ్‌`లో ఒక భాగం. నెట్ ఫ్లిక్స్ లో ఇది విడుద‌లైంది. డేవ్ బటిస్టా-టిగ్ నోటారో కూడా ఇందులో నటించారు. ఖురేషి ఈ చిత్రంలో గీతా అనే ఒంటరి తల్లిగా నటించారు. ఆమె యుద్ధ వినాశనానికి గురైన లాస్ వెగాస్ వెలుపల నిర్బంధ శిబిరంలో నివసిస్తుంది.

ఇది హాలీవుడ్ లో మొద‌టి ప్ర‌య‌త్నం. భారతదేశంలో ఒకే సమయంలో బహుళ ప్రాజెక్టులలో పనిచేయడం అలవాటు.. కానీ ఈ చిత్రం కోసం వారు నా రెండున్నర నెలల స‌మ‌యం ఖర్చు చేయించార‌ని హ్యూమా తెలిపింది. బాలీవుడ్ లోనూ హ్యూమా కెరీర్ ప‌రంగా బిజీగా ఉంది.
Tags:    

Similar News