ఎన్టీఆర్.. భారీ సెట్టింగ్స్.. ఒక్క షెడ్యూల్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీటన్నిటినీ పక్కా ప్లానింగ్ తో అనుకున్న సమయానికల్లా పూర్తి చేసేలా చేస్తున్నారట. అందుకు సమయాభావమే కారణం అని తెలుస్తోంది.
అసలు షూటింగే మొదలుకాకుండా.. సమయాభావం ఏంటి అనే డౌట్ రావచ్చు. కానీ ముందునుంచి అనుకుంటున్న ప్లాన్ ప్రకారం.. ఈ సినిమాను ఒక షెడ్యూల్ లోనే పూర్తి చేస్తారట. సినిమాను పూర్తి చేయడానికి త్రివిక్రమ్ చెక్కుతూనే ఉంటాడని టాక్. అలాగే ఎన్టీఆర్ లాంటి పెద్ద స్టార్ తో సినిమా కూడా టైం పడుతుంది. అలాంటిది వీరిద్దరూ కలిసి ఒకే షెడ్యూల్ లో సినిమా పూర్తి చేయాలని ప్లాన్ చేయడమే ఆశ్చర్యకమరైన విషయం. కానీ మొదటి నుంచి ఉన్న ప్లానింగ్ ఇదేనట. ప్రస్తుతం హైద్రాబాద్ పరిసరాల్లో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్టింగ్ వేస్తున్నారట.
షూటింగ్ ప్రారంభం అయ్యేది ఇక్కడే కాగా.. మరో రెండు ప్రాంతాల్లో కూడా సెట్టింగ్స్ నిర్మాణంలో ఉన్నాయి. సినిమాలో మేజర్ పోర్షన్ అంతా వీటిలోనే జరుగుతుందట. మొదటగా వీటిలో షూటింగ్ పూర్తి చేసేసి.. మిగిలిన ఔట్ డోర్ వర్క్ ను చివరలో షూట్ చేస్తారట. అలా మొదలుపెట్టిన దగ్గర నుంచి పూర్తయ్యే వరకూ లాంగ్ షెడ్యూల్ లో చేస్తూనే ఉంటారట. ఇంతకీ సమయాభావం అన్న మాట ఎందుకు వచ్చిందంటే.. రాజమౌళి తెరకెక్కించే సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యేలోపు త్రివిక్రమ్ సినిమా షూట్ కంప్లీట్ అయిపోవాలి. అదీ లెక్క.